పెరుగుతున్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లోకి మాల్వేర్‌లను పంపిస్తూ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు.
ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే గ్యాడ్జెట్లపై మాల్వేర్‌ల దాడి అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి మాల్వేర్‌ల దాడుల గురుంచి గూగుల్ ఎప్పటికప్పుడు యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది.
ఇలాంటి 17 యాప్‌లను గూగుల్ తాజాగా గుర్తించింది. ఇవి ఫోన్‌లోని బ్యాంకింగ్ సమాచారం, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు సహా ఇతర డేటాను దొంగిలిస్తాయని హెచ్చరించింది.
తక్షణమే వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలని హెచ్చరించింది. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉంది కనుక తక్షణమే తొలగించాలని సూచించింది.