నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేలా తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.
పదవ తరగతి అర్హతతో రేషన్ డీలర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
రెవిన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉన్న గ్రామాల్లో రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
పది లేదా ఆపై చదువులు చదివిన వారు కూడా ఈ రేషన్ డీలర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: రేషన్ డీలర్ పోస్టుకి దరఖాస్తు చేసుకునేవారు కనీసం పదవ తరగతి పాసై ఉండాలి.
ఆ పై చదువులు చదివిన వారు ఈ కూడా జాబ్ కి అర్హులే.
వయసు పరిమితి: రేషన్ డీలర్ జాబ్ కి అప్లై చేసేవారి వయసు 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తుదారుల మీద ఎలాంటి సివిల్ కేసులు గానీ క్రిమినల్ కేసులు గానీ ఉండకూడదు.
ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ లో మాత్రమే చేసుకోవాలి.
సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది.
రాత పరీక్షలో పాసైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో పాసైనవారికి రేషన్ డీలర్ జాబ్ ఇస్తారు.
దరఖాస్తు రుసుము: రూ. 1000/-
దరఖాస్తు చివరి తేదీ: 06/01/2023