ప్రకాశ్ రాజ్ “మా” అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడన్న వార్త బయటకి రాగానే.. అయనపై నాన్ లోకల్ అనే విమర్శలు జడివానలా కురిశాయి. కానీ.., ఈ విలక్షణ నటుడు ఆ విమర్శలను తిప్పి కొట్టడంలో విఫలం అయ్యాడు.
తాను తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన వాడినన్న వాదనని మా మెంబర్స్ లోకి బలంగా తీసుకెళ్ల లేకపోయారు ప్రకాశ్ రాజ్. ఇదే ప్రకాశ్ రాజ్ ఓటమికి ప్రధాన కారణం అయ్యింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకాశ్ రాజ్ కంటూ ఓ వర్గం లేదు. కానీ.., “మా” అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలి అనుకున్నాడు. అయితే.., ఇందుకోసం అందరిని కలుపుకుని పోవడంలో మాత్రం ప్రకాశ్ రాజ్ విఫలం అయ్యారు.
ఒకవైపు మంచు విష్ణు ఇండస్ట్రీలోని ప్రతి కుటుంబాన్ని కలసి, వారి మద్దతు కూడా కడుతుంటే, ప్రకాశ్ రాజ్ మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు.
నటుడిగా ప్రకాశ్ రాజ్ స్థాయి కూడా ఆయన ఓటమికి కారణం అయ్యిందంటే మీరు నమ్ముతారా? ప్రకాశ్ రాజ్ అంటే పాన్ ఇండియా యాక్టర్. ఇంత బిజీ ఆర్టిస్ట్ ఎప్పుడు, ఏ రాష్ట్రంలో, ఏ షూటింగ్ లో ఉంటాడో తెలియని పరిస్థితి.
ఇలాంటి స్థితిలో ప్రకాశ్ రాజ్ “మా” సమస్యల కోసం ఎంత సమయాన్ని కేటయించగలడు? మెంబర్స్ కి వచ్చిన ఈ అనుమానమే ప్రకాశ్ రాజ్ కొంప ముంచింది.
ప్రకాశ్ రాజ్ పై పదుల కొద్దీ కాంట్రవర్ససీలు ఉన్నాయి. దర్శక, నిర్మాతలతో గొడవలు ఉన్నాయి. నిజానికి ఇవన్నీ పాత గొడవలు. కానీ.., ప్రతిసారి ప్రెస్ మీట్స్ లో మంచు విష్ణు వీటినే హైలెట్ చేస్తూ వచ్చారు.
ఇక్కడ కూడా విమర్శలను సరిగ్గా తిప్పి కొట్టలేక ప్రకాశ్ కొన్ని ఓట్లను కోల్పోయాడు. ఇదే ఫలితంపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ మద్దుతు విష్ణుకే ఉంది. నరేశ్ అనుభవం, పరిచయాలు విష్ణుకి వరం గా మారగా, ప్రకాశ్ రాజ్ కి శాపం అయ్యింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ విషయంలో ప్రకాశ్ రాజ్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు. కనీసం తన మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశానికి తగిన ప్రధాన్యత కల్పించకపోవడంతో ప్రకాశ్ రాజ్ ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ ఆయన ఉద్దేశ్యం మంచిదే అయినా.. కొంత నెగిటివిటిని మాత్రం కొని తెచుకున్నట్టు అయ్యింది. దీని వల్ల కూడా ప్రకాశ్ రాజ్ కొన్ని ఓట్లను కోల్పోయారు.
తన శక్తి సామర్ధ్యాలను నమ్ముకుని పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోకుండా, పూర్తిగా మెగా ఫ్యామిలీపై డిపెండ్ అయిపోవడం ప్రకాశ్ రాజ్ పరాజయానికి కారణం అయ్యింది.
ఇండస్ట్రీ అంటే లేడీ ఆర్టిస్ట్స్ సమస్యలు తప్పవు. ప్రకాశ్ రాజ్ ఈ విషయంలో మహిళ మెంబర్స్ కి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
ఇదే సమయంలో మంచు విష్ణు మాత్రం శ్రీరెడ్డికి సైతం న్యాయం చేస్తామని కామెంట్స్ చేయడంతో.. మహిళా ఓటర్లు అంతా ప్రకాశ్ రాజ్ కి షాక్ ఇచ్చారు.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ కూడా అతనికి ఓటమికి కారణంగా కనిపిస్తోంది. జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయి కుమార్, అనసూయ, బ్రహ్మాజి, సమీర్, ఉత్తేజ్ వంటి ప్యానెల్ మెంబెర్స్ అజాతశత్రువులే అయినా.. వీరు మెంబర్స్ చేత ప్రకాశ్ రాజ్ కి ఓటు వేపించడంలోకి సక్సెస్ కాలేకపోయారు.