ఇషాన్ కొట్టిన ఒక్క డబుల్ సెంచరీతో  10 సరికొత్త రికార్డులు!  

బంగ్లాదేశ్ తో నామమాత్ర మూడో వన్డేలో భారత  బ్యాటర్లు చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా ఇషాన్  కిషన్ డబుల్ సెంచరీతో అల్లాడించాడు.

సెంచరీ వరకు చాలా నెమ్మదిగా ఆడిన ఇషాన్..  ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయాడు. 126 బంతుల్లో  డబుల్ సెంచరీ చేశాడు. 

రోహిత్ శర్మ 264 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడేమోనని  ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ 210 పరుగుల వ్యక్తిగత  స్కోరు వద్ద ఔటైపోయాడు.

వన్డేల్లో తన తొలి మూడంకెల స్కోరుని డబుల్ సెంచరీగా  మార్చిన ఇషాన్ కిషన్.. పలు సరికొత్త రికార్డులు  క్రియేట్ చేయడం విశేషం.

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో  భారత బ్యాటర్ గా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశాడు.  ఇతడి కంటే ముందు సచిన్, సెహ్వాగ్,  రోహిత్ శర్మ ఈ మార్క్ క్రాస్ చేశారు. 

వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక  స్కోరు చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.  అంతకు ముందు ధోనీ(183) పేరిట ఈ రికార్డు ఉంది.

బంగ్లాదేశ్ లో 2011లో వాట్సన్(ఆస్ట్రేలియా)  185 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఇప్పుడు ఆ దేశంలో హైయస్ట్ స్కోరు చేసిన  క్రికెటర్ గా ఇషాన్ నిలిచాడు.

బంగ్లాతో మూడో వన్డేలో 10 సిక్సర్లు బాదిన  ఇషాన్ కిషన్.. సచిన్ రికార్డుని బ్రేక్ చేశాడు.  2000లో సచిన్, బంగ్లాదేశ్ జట్టుపై 7 సిక్సులు కొట్టాడు.

వన్డేల్లో తొలి సెంచరీని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా  మలచిన బ్యాటర్ గా ఇషాన్ రికార్డు క్రియేట్ చేశాడు.  అంతకు ముందు కపిల్ దేవ్.. తొలి సెంచరీని  175 పరుగులుగా చేసి నాటౌట్ గా నిలిచాడు.

103 బంతుల్లో 150 స్కోరు దాటిన ఇషాన్..  ఫాస్ట్ గా 150 ప్లస్ స్కోరు చేసిన భారత బ్యాటర్ గా  ఘనత సాధించాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్..  112 బంతుల్లో 150 ప్లస్ స్కోరు చేశాడు.

2020 జనవరిలో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ  సెంచరీ బాదాడు. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత  టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఓపెనర్ ఇషాన్ కిషన్.

బంగ్లాదేశ్ లో అతి చిన్న వయసులో 50 ప్లస్  స్కోరు చేసిన భారత క్రికెటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు.  ఈ క్రమంలోనే గంభీర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

గంభీర్.. 21 ఏళ్ల 184 రోజుల్లో బంగ్లాలో  50 ప్లస్ చేసిన ఓపెనర్ కాగా.. ఇషాన్ కిషన్..  24 ఏళ్ల 145 రోజుల్లో ఈ మార్క్ ని క్రాస్ చేశాడు.

టీమిండియా లెఫ్ట్ హ్యాండర్స్ లో అత్యధిక పరుగులు  చేసింది ఇషాన్ కిషన్. అంతకు ముందు 1999  వరల్డ్ కప్ లో గంగూలీ 183 పరుగులు చేశాడు.  ఇప్పుడు ఇషాన్ దీన్ని బ్రేక్ చేశాడు.