తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా వెండితెరపైకి అడుగు పెట్టాడు మహేశ్ బాబు.
ఆ తర్వాత టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.
నటుడిగా కంటే మహేశ్ ను ఓ వ్యక్తిగా అభిమానించే వారే ఎక్కువ.
మహేశ్ బాబు గురించి మీకు తెలియని ఓ 10 ఆసక్తికర అంశాలు మీకోసం.
మహేశ్ నాలుగేళ్ల వయసులోనే మురళీ మోహన్ లీడ్ రోల్, దాసరి దర్శకత్వం వహించిన ‘నీడ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.
తండ్రితో కలిసి మహేశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాడు. కానీ, చదువు పూర్తి చేయాలని కృష్ణగారు కోరడంతో.. 1990 నుండి 9 ఏళ్లు విరామం తీసుకున్నాడు.
మహేశ్ కి తెలుగు బాగా అర్థమవుతుంది, అనర్గళంగా మాట్లాడగలడు. కానీ చదవడం, రాయడం చేయలేడు. చిన్నప్పటి నుండి చెన్నైలో పెరగడమే అందుకు కారణం.
మహేష్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. తర్వాత.
నటనలో శిక్షణ కోసం విశాఖపట్నంలో నట గురువు ఎల్.సత్యానంద్ దగ్గర జాయిన్ అయ్యారు.
8 నంది అవార్డులు సాధించిన ఏకైక తెలుగు నటుడు మహేష్ బాబు.
వంశీ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ నమ్రతాతో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత మంజుల గారు కృష్ణను ఒప్పించారు.
మహేశ్ బాబు తన వార్షిక ఆదాయంలో దాదాపు 30% స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తాడు.
2019లో మేడమ్ టుస్సాడ్స్ లో మహేశ్ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు నటుడు మహేశ్ బాబు.
మహేశ్ వార్షిక ఆదాయం 350 మిలియన్ డాలర్లు.
తెలుగులో మరే నటుడుకి సాధ్యంకాని రీతిలో చాలా కమర్షియల్స్ లో నటిస్తున్నాడు.
మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియాలో మహేశ్ ఇప్పటికీ చోటు సంపాదించుకుంటూనే ఉన్నాడు.