ఆ సిరీస్ నోటు మీ దగ్గరుందా? అయితే కాసుల పంటే!

కొంత మందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఒక్కోసారి ఒక్కరూపాయి నోటుని కూడా వేలు, లక్షలు పెట్టి కొంటారు. ఒకటి కరెన్సీ కలక్షన్ అలవాటు, రెండు అలాంటి నోటు వారి దగ్గరుండాలనే కోరిక. కారణం ఏదైనా ఆన్లైన్ వేదికగా కొందరికి మంచి లాభాలే తెచ్చిపెడుతోంది. పాత నాణేలు, నోట్లు మాదిరిగానే ‘786’ సిరీస్ నోట్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఆ సిరీస్ నోట తమ దగ్గరుంటే వారికి మంచి జరుగుతుందనే నమ్మకం. ముక్యంగా ముస్లింలు ఈ సిరీస్ నంబరు కలిగిన వస్తువులు, ఫోన్ నంబర్లు, కరెన్సీ నోట్లను సేకరిస్తుంటారు.

786 currency noteమరి, ఆ సిరీస్ నోటు మీ దగ్గరుంటే మీకు కాసులు వర్షం కురిసినట్లే. అది ఎంత నోటు అన్నది సంబంధం లేకుండా మీకు డబ్బు వస్తుంటుంది. అందుకు మీరు చేయాల్సిందంతా.. ఈ కామర్స్ వెబ్సైట్లలో అమ్మకందారునిగా నమోదు చేసుకోవాలి. ఉదాహరణకు ఈ-బే వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు, పేరు, వివరాలతో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గరున్న కరెన్సీ నోటును మంచిగా ఫొటో తీయాలి. ఆ ఫొటోను మీ ఈ- బే ఖాతాలో అప్లోడ్ చేయాలి. ఆ నోటును తీసుకోవాలి అనుకున్నవారు మీ మొబైల్ నంబరుకు సందేశం లేదా ఫోన్ చేస్తారు. ప్రైస్, చెల్లింపుల వివరాలు అప్పుడే మాట్లాడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం