2022 కొత్త ఏడాది మొదలైంది. అందరూ లైఫ్ లో అంతా మంచి జరగాలని, కరోనా నుండి విముక్తి కలగాలని కోరుకుంటారు. కొందరు మాత్రం ఏడాదిలో పూర్తి చేయాల్సిన లక్ష్యాలను సెట్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. 2022 ఏడాదిలో కొందరు లవ్ విషయంలో టెన్షన్ పడుతుంటారు. ఈ సంవత్సరమైనా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? అనే విషయాలు జ్యోతిష్య శాస్త్రం చెప్పగలదని అంటున్నారు. మరి 12 రాశులలో ఈ రాశులవారు ప్రేమలో సక్సెస్ అవుతారని చెబుతుందట శాస్త్రం. ఆ రాశులు ఏంటో చూద్దాం! వృషభ రాశి: 2022 ఏడాదిలో ఈ రాశి వారు జీవితాన్ని బ్యాలెన్సింగ్ గా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే.. ఎవరినైనా చూడగానే వారు తమకు కరెక్ట్ కాదనే విషయం వెంటనే అర్ధం చేసుకోగలరట. అలాగే వారినే లైఫ్ పార్టనర్ చేసుకునే ప్రయత్నం చేస్తారని సమాచారం. కర్కాటక రాశి: ఈ రాశి వారు 2022లో తమకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అదీగాక వీరి జంటగా రాబోయేవారు బాగా అర్థం చేసుకుంటారట. వీరు ఈ ఏడాదిలో తమ పార్ట్నర్ తో కలిసి వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేస్తారట. కన్య రాశి: ఈ రాశి వారు 2022లో సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు. అందుకే జీవిత భాగస్వామికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే ఈ రాశి వారు కోరుకున్న వారిని కలుసుకొని, వారితో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారట. ధనస్సు రాశి: ఈ రాశి వారు 2022లో నచ్చిన భాగస్వామిని కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఒకవేళ ఆల్రెడీ పార్టనర్ ఉంటే.. మరింత దగ్గరయ్యే అవకాశం ఉందట. ఈ జంట లవ్ లైఫ్ లో ఆనందంగా ఉంటారని సమాచారం. మకర రాశి: ఈ రాశి వారు 2022లో తమ లైఫ్ పార్టనర్ ని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అదీగాక ప్రేమ విషయంలో వీరు పెద్దలను ఒప్పించి గెలుస్తారట. ప్రేమ పెళ్లికి మార్గాలు ఎక్కువగా ఉన్నాయట. మరి వీటిలో మీ రాశి ఉన్నట్లయితే.. కామెంట్స్ లో తెలియజేయవచ్చు.