వరదలో బస్సుని దించేసిన డ్రైవర్! గుండెలు అదిరిపోయే వీడియో!

Passengers on Flooded Bridge

సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా.. ఇప్పుడు దేశంలో ఎక్కడ పట్టినా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నదులు, వాగుల్లో వరద నీరు ఉదృత స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాలూ నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

MSRTC Driver Takes Bus With Passengers on Flooded Bridgeఅది మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లా. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఆర్టీసీ సర్వీస్ లు మొదలయ్యాయి. కానీ.., భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు నిండిపోయాయి. వరద నీరు వంతెనల పై నుండి ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆర్టీసీ బస్ కూడా వంతెన ముందు ఆగిపోయింది. ప్రవాహం ఉదృతి ఎక్కువగా ఉండటంతో మిగతా వాహనాలు కూడా ఆ వంతెన ముందు ఆగిపోయాయి. కానీ.., ఆ బస్ డ్రైవర్ మూర్ఖంగా బస్సుని వంతెనపైకి పంపించాడు.

బస్సులో జనం వద్దు అంటున్నా అతను ఎవరి మాట లెక్క చేయలేదు. అలానే వంతెన పై నుండి బస్సుని రోడ్ దాటించాడు. నిజానికి ముందుకి పోవడం ప్రమాదం అనిపించినప్పుడు డ్రైవర్ బస్సుని అక్కడే ఆపేసి అధికారులకి సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ.., ఈ డ్రైవర్ మాత్రం ఇంత మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఇప్పుడు విమర్శలకి తావిస్తోంది. ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ బస్సు నీటిలో కొట్టుకుని పోయుంటే పరిస్థితి ఏమయ్యి ఉండేది? ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి.