ప్రస్తుతం అంతా సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఈ మాద్యమం ద్వారా ప్రతి ఒకరు తమకు నచ్చిన విషయాలను షేర్ చేసుకుంటుంటారు. అంతేగాక తమ పరిసరాల్లో జరిగే సంఘటనలు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని వీడియోలు ఎమోషనల్ గా అనిపిస్తే, మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. అడవిలో ఉండాల్సి జంతువులు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ కుక్కను మరో కుక్క పిల్లల ముద్దు పెట్టుకునే సరి అది తెగ సంబరపడిపోయింది. ఓ రేంజ్ లో గంతులేస్తూ ఆటూ ఇటూ తిరుగుతూ తన ఆనందాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు అడుగుల ఎత్తులో ఉన్న అరుగు మీద ఓ కుక్క ఉండగా , అరుగు కింద ఓ నల్ల కుక్క పిల్ల ఉంది. రెండు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి.. ముచ్చటిస్తున్నాయి. ఇంతలో కుక్కపిల్ల కుక్కకు ముద్దు పెట్టింది. అంతే తర్వాత ఎంతో సంతోషంగా గంతులేస్తూ అరుగుపైనే కొద్ది సేపు చక్కర్లు కొట్టింది. ఆనందం పట్టలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ రకరకాల చేష్టాలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో ఫన్నీగా ఉందని, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుందని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. The first kiss.. pic.twitter.com/JWZdIGp0MW — Buitengebieden (@buitengebieden) June 19, 2022