కొత్తగా సూర్యుడొచ్చెనా… మేడిన్ చైనా!…

HL-2M టోకామాక్ రియాక్టర్ – కృత్రిమ సూర్యుడి పేరు ఇది. ఇది కేవలం విద్యుత్ తదితర అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న రియాక్టర్. దీని ద్వారా ఏర్పడే అణుశక్తిని చైనా విద్యుత్తు అవసరాల కోసం ఉపయోగిస్తుందని చెబుతున్నారు. చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగ పరిశోధనా పరికరం. ఇది న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా ఇవ్వగలదని సైంటిస్టులు ఆశిస్తున్నారు. చైనా టెక్నాలజీలో దూసుకుపోతోంది. అత్యధిక ధనిక దేశాలు కూడా చేయలేనటువంటి సాంకేతికతను సొంతం చేసుకుంది. సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లుగా సూపర్ సూపర్ పవర్ ‘‘ఆర్టిఫిషియల్ సన్’ని తయారు చేసుకుంది డ్రాగన్ దేశం. ఈ భూగోళానికి సూర్యుడు ఒక్కడే అనే సంగతి తెలిసిందే. అయితే, భవిష్యత్తులో ఈ ప్రశ్నకు సమాధానం మారిపోవచ్చు. చైనా ఇప్పుడు కృత్రిమ సూర్యుడిని రంగంలోకి దించింది.

china fusion reactor

కొన్ని నెలల కిందట చైనా ఈ విషయాన్ని చెబితే కేవలం మాటలే అనుకున్నారు చాలామంది. కానీ, దాన్ని నిజం చేసి చూపించేందుకు కృత్రిమ సూర్యుడిని యాక్టీవ్ చేసి ఔరా అనిపించింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా కృత్రిమ సూర్యుడిని రూపొందించే పనిలో పడ్డాయట. సూర్యుడి పరమాణు కేంద్రంలో అత్యధిక శక్తి ఉంటుంది. అందులోని అణువులు విచ్చిన్నమైనప్పుడు భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది. వేడి ప్లాస్మాను ఇది విచ్చిన్నం చేయగలదు. తద్వారా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఎనర్జీని విడుదల చేయగలదని పీపుల్స్ డైలీ తెలిపింది. 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ అంటే ఒరిజినల్ సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ వేడి అన్నమాట. అయితే ఇవేవో ఆకాశంలో కనిపించే సూర్యుళ్లు కావు. నేలపై నిప్పులు కురిపించి సూర్యుడి కంటే రెట్టింపు శక్తిని అందించే రియాక్టర్లు. కానీ, దీన్ని అణ్వాయుధాలకు కూడా సైతం వాడుకొనే ప్రమాదం ఉందని తెలుస్తోంది.