అతనో అద్భుతం…ఇలాంటోడు ‘ఒక్కడు’ చాలు!..

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సునిశిత్ ని గతంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రముఖ హీరోలు , హీరోయిన్లపై పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో అసభ్యకరమైన వ్యాక్యలు చేయడం వలన కొంతమంది నటులు అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది . ప్రముఖ హీరోలు వారు చేసిన సినిమాలను గతంలో నేనే చేయాల్సింది కుట్రపన్ని ఇలా తన అవకాశాలను వాళ్ళు లాక్కొని సినిమాలు తీసారని అవకాశాలు ఇవ్వకుండా చేసారని అలాగే ప్రముఖ హీరోయిన్లతో తనకి ఎఫైర్స్ ఉన్నాయని ఇలా ఉన్నవి లేనివి మాటలు చెబుతూ సోషల్ మీడియాలో , యూట్యూబ్ ఛానల్స్‌లలో పాపులారిటీ సంపాదించాడు.

మొదట అతను ఫోకస్ చేసింది మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా పైనే. దర్శకుడు సుకుమార్ తనకు కథ చెప్పి సగం షూటింగ్ కూడా పూర్తి చేశాడని అన్నాడు. ఇక షూటింగ్ మధ్యలో మహేష్ బాబు వచ్చి సుకుమార్ ను ఒప్పించి తనను తప్పించారని చెప్పాడు. ఇక ఆ సినిమాను వదులుకున్నందుకు గాను మహేష్ బాబు భారీ ఎమౌంట్ కూడా ఇచ్చినట్లు చెబుతూ ఆ డబ్బుతో ఖరీదైన కారును కూడా కొన్నట్లు వివరణ ఇచ్చాడు.మహేష్ బాబు వచ్చి సుకుమార్ ను ఒప్పించి తనను తప్పించారని చెప్పాడు. ఇక ఆ సినిమాను వదులుకున్నందుకు గాను మహేష్ బాబు భారీ ఎమౌంట్ కూడా ఇచ్చినట్లు చెబుతూ ఆ డబ్బుతో ఖరీదైన కారును కూడా కొన్నట్లు వివరణ ఇచ్చాడు.

రీసెంట్ గా అతను సోషల్ మీడియా ఎకౌంట్ లో ఒక ఫొటో పోస్ట్ చేసిన విధానం ట్రోల్ అవుతోంది. ఏకంగా 1 నేనొక్కడినే హీరోయిన్ కృతి సనోన్ స్కూటీపై వెళుతున్న ఫొటోను మార్ఫింగ్ చేసినట్లు ఉంది. దీంతో మీమర్స్ అతనిపై రోజుకో మీమ్ క్రియేట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.