ముంబై భామ మురారిలో మహేష్ బాబు సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలచిపోయింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ,రవితేజ, నాగార్జున వంటి టాప్ స్టార్స్ పక్కన నటించింది. పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్ బాయ్ చెప్పింది. గత ఏడాది క్యాన్సర్ కు గురై, చికిత్స నిమిత్తమై న్యూయార్క వెళ్లి క్షేమంగా ఇండియా కు తిరిగి వచ్చింది. అయితే సోనాలి బింద్రే కి డాక్టర్స్ బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారట. ఆ జ్ఞాపకాలను మరో సారి ఒక ఇంటర్వ్యూ లో గుర్తు చేసుకుంది.
సోనాలి బింద్రే మాట్లాడుతూ ‘ స్కాన్ చేసిన తరువాత నా ఉదార భాగాన క్యాన్సర్ రేస్ ఉన్నాయని నిర్దారించారు . కేవలం 30 శాతం మాత్రమే బ్రతికే అవకాశాలున్నట్లు తేల్చేసారు.. ఆ క్షణాన నేను భయపడ్డాను. కానీ చనిపోతాననే భయం మాత్రం లేకుండే, నేను కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని మాత్రం అర్థమైంది . ఇప్పుడు నేను నా హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా ధైర్యం చెప్పారు. దాదాపుగా వారి అండతోనే నేను బయట పడ్డాను. ‘ అని చెప్పారు.
అంతే కాకుండా క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు సజెషన్ కూడా చేశారు. ప్రేమానురాగాలతో ఉండాల్సిన సమయమిది. కుటుంబ సభ్యులు , స్నేహితులు పక్కనే ఉండేలా చూసుకోండి. వారి ప్రేమతో పాటు, మీ ధైర్యం కూడా అవసరమంటూ జాగ్రత్త వహించండని చెప్పింది.