Home Uncategorized జ‌‌బ‌ర్ద‌స్త్ పై రోజా షాకింగ్ కామెంట్స్

జ‌‌బ‌ర్ద‌స్త్ పై రోజా షాకింగ్ కామెంట్స్

roja thumb 1

సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం, రాజ‌కీయాల్లో వాళ్లు సినిమాల్లో రావ‌డం ప‌రిపాటి అయ్యింది. నేత‌లు ప్రొడ్యూస‌ర్‌గానో..లేదంటే మ‌రో ర‌కంగానో ఎంట్రీ ఇవ్వ‌డం ఆనావాయితీగా వ‌స్తున్న‌దే. త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత‌….. తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా అంద‌రూ సినిమాల నుంచి రాజ‌కీయాలకు వ‌చ్చిన‌వాళ్లే. ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే సీఎంలుగా ఉంటూ రాజ‌కీయాల్లో కొన‌సాగుతూ కూడా సినిమాల్లో చేసిన ఘ‌న‌త ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల‌కు మాత్ర‌మే ద‌క్కింది. ఇక చిరంజీవి రాజ‌కీయాలు పూర్తిగా ప‌క్క‌నే పెట్టేసి…. సినిమాల్లో బిజీ అయిపోయారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్న విష‌యం అందిరికీ తెలిసిందే. అయితే వీళ్లంతా మ‌గ‌వాళ్లు. ఇక ఆడ‌వాళ్లు విష‌యానికొస్తే వైసీపీలో చురుకైన నేత‌గా ఉంటూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న న‌టి ఆర్కే రోజా.

రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా…ఎంట‌ర్ టైన్ మెంట్ ఈవెంట్ల‌లో మాత్రం బాగా క‌నిపిస్తుంటారు. జ‌బ‌ర్ద‌స్త్ ప్రొగ్రాంతో పాటు ప‌లు పండుగ ఈవెంట్ల‌లో సంద‌డి చేస్తుంటారు. గ‌తంలో అయితే 2019 వ‌ర‌కు అయితే రోజా ప్ర‌తిప‌క్షంలో ఉండేది. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత అధికార‌ప‌క్షం అయ్యింది. పైగా న‌గ‌రి ఎమ్మెల్యే గానే కాదు..ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ లో నాగ‌బాబు మానేసినా రోజా ఒంటి చేత్తో …..ఆ కార్య‌క్ర‌మాన్ని న‌డిపిస్తూ త‌న స‌త్తా చాటుతూనే ఉంది. మ‌రి అలాంటి రోజా స‌డ‌న్ గా జ‌బ‌ర్ద‌స్త్ వ‌దిలేస్తాన‌ని చెబితే….జ‌బ‌ర్త‌స్త్ అభిమానులు జీర్ణించుకోగ‌ల‌రా…అస‌లు ఆమె అలా అంటుందా….ఈ ప్ర‌శ్న‌లు ఆస‌క్తిని రేపుతున్నాయి. నిజానికి వైసీపీలో రోజాకు ఫైర్ బ్రాండ్ గా ముద్ర‌ప‌డింది. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబుపై విరుచుకుప‌డేది. అయితే ఈ మ‌ధ్య ఓ వీడియో ప‌ర్స‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు…. ఒంటికాలిపై లేచినంత ప‌ని చేసింది. తాను త‌న ఆత్మ‌సంతృప్తి కోస‌మే జ‌బ‌ర్త‌స్త్ లాంటి షో చేస్తున్నానే త‌ప్ప‌….. ఎవ‌రో ఏదో అన్నార‌ని మానేసేది లేద‌ని తేల్చిచెప్పింది. తాను అను‌కుంటే త‌ప్ప మానేది లేద‌ని రోజా తెగేసి చెప్పింది.

అయినా మా పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి లేని అభ్యంత‌రం…. మీడియాకు ఎందుకో అంటూ సీరియ‌స్ అయ్యింది. సినిమాలు, రాజ‌కీయాలు త‌న‌కు రెండు క‌ళ్లు అని చెప్పుకొచ్చింది. ప్రొఫెష‌న్ సినిమా అయితే..రాజ‌కీయాలు ప్రాణం అని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టింది. న‌టిగా ప్ర‌జ‌ల గుండెల్లో స్ఠానం ఇచ్చారని…. దాన్ని కాపాడుకుంటున్నాన‌ని తెలిపింది. రాజ‌కీయాల్లో ఉంటే మోడ్ర‌న్ డ్ర‌స్సులు వేసుకోకూడ‌దా, డాన్సులు చేయ‌కూడ‌దా అని ఎదురు ప్ర‌శ్నించింది. అలా అయితే గ‌తంలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్టీఆర్ డ్యాన్సులు చేయ‌లేదా..అంతెందుకు ఇప్పుడు బాల‌య్య సినిమాలు చేయ‌డం లేదా అని స‌ద‌రు మీడియా ప్ర‌తినిధిని నిల‌దీసింది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక పార్టీకి అధ్య‌క్షుడిగా ఉండి…సినిమాలు చేస్తున్నాడు అంటూ వ‌రుసు పెట్టి క‌డిగి పారేసింది. రోజా సమాధానానికి స‌దరు మీడియా ప్ర‌తినిధి కూడా భ‌య‌ప‌డేంత పని జ‌రిగింది. తాను మానేయాల‌ని అనుకుంటే త‌ప్ప‌…ఎవరు చెప్పినా తాను మానే ప్ర‌స‌క్తే లేద‌ని మ‌రోసారి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టింది రోజా. అయితే గ‌త రెండు వారాల నుంచి జ‌బ‌ర్ద‌స్త్ షోలో రోజా క‌నిపించ‌డం లేదు. ఆమె ప్లేస్ లో కొరియాగ్రాఫ‌ర్ శేఖ‌ర్ జ‌డ్జిగా కూర్చొంటున్నారు. అయితే రోజా కుద‌ర‌క రావ‌డం లేదా….వ‌ద్ద‌నుకుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రోజా స‌న్నిహితులు మాత్రం ఆమె బిజీగా ఉండ‌డం వల్లే రాలేక‌పోయార‌ని చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad