Home Uncategorized ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

mahesh thumb 2

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా అవతరించారు. మహర్షి,శ్రీమంతుడు,భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ కు సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. మహేష్ బాబుకు తెలుగుతో పాటుదేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఆనాడు మహేష్ అభిమానులు కోలాహలం భారీ స్థాయిలో ఉంటుంది. బైక్స్ తో ర్యాలీ తీయడం,పెద్ద పెద్ద బ్యానర్లు, కేకులు కోయడం వంటివాటిని ప్రిన్స్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా జరుపుతారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ తారా స్థాయిలో ఉండడంతో మహేష్ బాబు తన అభిమానులు ఎవరు పుట్టినరోజు వేడుకలు అని భారీగా నిర్వహించవద్దని ఇప్పటికే విన్నవించారు.

అయితే ఇప్పుడు మహేష్ అభిమానులు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటలపాటు మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్రెండ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో బర్త్‌డే ట్రెండ్ చేపట్టి 27 మిలియన్‌కు పైగా ట్వీట్స్‌తో ట్విట్టర్‌ను షేక్ చేశారు. అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజున #HappyBirthdayNTR హ్యాష్ ట్యాగ్‌తో 21.5 మిలియన్ ట్వీట్లు చేశారు ఫ్యాన్స్. వీరికి పోటీగా ఇప్పుడు మహేష్ అభిమానులు భారీ ట్రెండ్ కు సిద్ధం అవుతున్నారు. మరి కొద్ది గంటల్లో ఏ హంగామా ట్విట్టర్లో మొదలు కానుంది. చూడాలి మరి ఈ సారి మహేష్ అభిమాన ధాటికి ట్విటర్ దద్దరిల్లి పోతుందో లేదో !.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad