Home Uncategorized చైనాకు చుక్కలు చూపిస్తున్న జపాన్:వాణిజ్య యుద్ధం

చైనాకు చుక్కలు చూపిస్తున్న జపాన్:వాణిజ్య యుద్ధం

japan china flag

అమెరికాతో వాణిజ్య యుద్ధం ఎదుర్కొంటున్న చైనాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జపాన్ ప్రభుత్వం చైనాలో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జపాన్ వాణిజ్య విస్తరణ కార్యక్రమంలో భాగంగా చైనా నుండి తమ యూనిట్లను ఆసియా దేశాలకు తరలించేందుకు జపాన్ సిద్ధమవుతుంది. ముఖ్యంగా భారత్ మరియు బంగ్లాదేశ్ కు తమ కంపెనీల తరలించేందుకు జపాన్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

భారత్ మరియు బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. జపాన్ నుంచి ప్రామాణిక పెట్టుబడుదారులనుంచి నమ్మకమైన భాగస్వాములకోసం చూస్తున్నామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. 

జపాన్, భారతదేశం వాణిజ్య వ్యాపార సంబంధాలను విస్తరించడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. అలాగే దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా 13వ జపాన్ పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అస్సాంలో ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోందని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర ఒక సమావేశంలో తెలిపారు. 

జపాన్ కంపెనీల సరఫరా గొలుసు చైనాపై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది నిలిచిపోయింది.  దీంతో మొదటి దశలో వియత్నాం  లావోస్‌లలో హోయా ఎలక్ట్రానిక్ భాగాల ప్రాజెక్టు తయారీ సహా 30 తయారీ సంబంధిత ప్రాజెక్టులను జపాన్ ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం10 బిలియన్ యెన్లకు సబ్సిడీలను అందించింది. ఈ క్రమంలోనే తరువాతి ప్రణాళికలను కూడా తయారు చేస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad