Home Uncategorized ఇంట్లో తాబేలు ఉంటే ఏం జరుగుతుంది..

ఇంట్లో తాబేలు ఉంటే ఏం జరుగుతుంది..

HealthHelical.com Does Keeping Live Tortoise at Home bring Good Luck

ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌క‌మైన అభిరుచి , అల‌వాటు ఉంటుంది. కొంద‌రు కుక్క‌ల‌ను పెంచుకుంటారు.  మ‌రికొంద‌రు పిల్ల‌ల‌ను, ఇంకొంద‌రు ప‌క్షుల‌ను పెంచుకుంటూ ఉంటారు. మ‌రికొంద‌రు చాలా భిన్నంగా తాబేళ్ల‌ను పెంచుకుంటూ ఉంటారు. అస‌లు ఇంత‌కీ ఇళ్ల‌లో తాబేళ్లను పెంచుకోవ‌చ్చా….పెంచుకుంటే ఏమౌతుంది….భార‌తీయ వాస్తు శాస్త్రం దీనిపై ఏం చెబుతోంది..చైనా వాస్తు శాస్త్రంలో తాబేళ్లను ఇంట్లో పెట్టుకోవ‌డంపై ఏమ‌ని ఉంది….ఈ విష‌యాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  ఇంట్లో తాబేళ్ల‌ను పెంచుకోకూడ‌ద‌ని స‌నాత‌న సంప్ర‌దాయం చెబుతోంది. ఏ వ‌స్తువు ఎక్క‌డ ఉండాలో…ఏ ప్రాణి ఎక్క‌డ ఉండాలో అక్క‌డే ఉంచాలి. తాబేలును ఇంట్లో పెట్టుకూడ‌దు. స‌ర‌స్సులు, మడుగులు, స‌ర‌స్సుల్లోనే తాబేలు జీవించాలి.  మ‌నుషులు గృహాల్లో నివ‌సించాలి. 

ఈ నాటి కాలంలో ఏది ఎక్క‌డ ఉండాలో……. అక్క‌డే ఉండాలి. అయితే  ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో అన్ని దేశాల విశ్వాసాలు ఒక్క‌టిగానే మారుతున్నాయి. అలాంటి స‌మ‌యంలో చైనా దేశంలో బాగా ప్ర‌చారంలో ఉన్న వాస్తు శాస్త్తాన్ని అనుస‌రించి…. 13 ర‌కాలు వ‌స్తువుల‌ను మ‌న ప్రాంతంలో కూడా  ప్ర‌చారంలో పెట్టారు. ఆ ప‌ద‌మూడు వ‌స్తువుల్లో ఒక‌టి తాబేలు.  ధ‌నాన్ని మోసుకొచ్చే  కుబేరుడు…అలాగే డ్రాగ‌న్ బొమ్మ‌లు, వెదురుతో చేసిన వ‌స్తువులు,  ష‌డ్భ‌జాకారంలో ఉండే అద్ధం, చెట్లు …ఇలాంటివి 13 వ‌స్తువుల‌ను ఇంట్లో పెట్టుకుంటే మంచిద‌ని  చైనా వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ సూచ‌న‌ల‌ను గ‌మ‌నించి….. ఈ నాటి కాలంలో చాలా మంది తాబేళ్ల‌ను ఇంట్లో పెట్టుకుంటున్నారు. వీటిలో రంగును బ‌ట్టి కూడా పెంచుకుంటున్నారు. 

బంగారం లేదంటే వెండి రంగులో ఉండే తాబేలును సేకరించి ఇంట్లోని ఒక తొట్టిలో నీళ్ల‌ను ఏర్పాటు చేసి అందులో పెడుతున్నారు. అలాగే మ‌న ఇంట్లోనే ముందు గ‌దిలోనే టేబుల్ పై పెట్టుకుంటూ ఉండ‌టం మ‌నం చూసి ఉంటాం.  భార‌తీయ ధ‌ర్మం ప్ర‌కారం..దేవ‌తా స్థ‌లంలోనే కూర్మం ఉండాలి.  ఇక‌ తాబేలు ఆస‌నంపైన కూర్చొని కూర్మోసనం, ప్రాణాయామం, ధ్యానం, యోగా చేయాలి. అలా శ‌రీర శ‌క్తిని పెంచుకోవాలి. నిజంగా తాబేళ్ల‌ను స‌ర‌స్సుల్లో మాత్ర‌మే పెంచాలి.  ఆధునిక విశ్వాస‌లు క‌లిగి ఉంటే…ఇళ్ల‌లో కూడా  పెట్టుకోవ‌చ్చ‌ని చైనా  వాస్తు శాస్త్రం చెబుతోంది.  కాబ‌ట్టి  దాన్ని పెట్టుకోండి. కానీ భార‌తీయ వాస్తు శాస్త్రం ప్ర‌కారం తాబేళ్ల‌ను ఇంట్లో  పెట్టుకోకూడ‌ద‌ని స్ప‌ష్టంగా చెబుతోంది. అలా చేస్తే అరిష్ట‌మ‌ని కూడా అంటోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో ఎవ‌రి ఇష్టాలు వారివి ….ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. ఆయా వ్య‌క్తులు న‌మ్మేదాన్ని బ‌ట్టి  ఇది ఆధార‌ప‌డి ఉంటుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad