సెన్సార్ బోర్డు(సీబీఎఫ్సీ) గత పదహారు సంవత్సరాల్లో మొత్తంగా 793 చిత్రాల విడుదలను ఆపేసింది. లక్నోకు సంబందించిన నూతన్ థాకూర్ పిటిషన్ వేయగా ఆర్టీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. 2000 సంవత్సరం జనవరి 1 నుండి 2016 సంవత్సరం మార్చి 31 వరకు ఈ సినిమాలన్నింటిని సెన్సార్ బోర్డు పూర్తిగా అడ్డుకుంది. పదహారు సంవత్సరాలుగా 793 సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వకుండా సినిమాలను నిలిపి వేసిందని తెలిపాడు.
ఈ సినిమాల్లో మొత్తంగా 586 స్వదేశీ సినిమాలు కాగా, 207 విదేశీ చిత్రాలు కలిగున్నాయని తెలియ పరిచాడు. ఇందులో భాషా పరంగా చూసుకుంటే హిందీ భాషకు సంబందించి అనగా బాలీవుడ్ నుండి 231, తమిళ భాషకు చెందిన కోలీవుడ్ నుండి 96, తెలుగు భాష కు చెందిన టాలీవుడ్ నుండి 53, కన్నడ బాష కలిగిన శాండిల్ వుడ్ నుండి 39, మలయాళంకు సంబంధించి అనగా మాలీవుడ్ నుండి 23, పంజాబ్‌కు చెందిన 17 చిత్రాలున్నాయని తెలిపారు. 2015-16 ఏడాదిలో ఎక్కువగా 153 చిత్రాలకు సర్టిఫికెట్ ఇవ్వకుండా నిలిపి వేయడం గమనార్హం. నిలిపి వేసిన సినిమాలలో చాలా వరకు సెక్స్, థ్రిల్లర్ క్రైమ్ స్టోరీలున్న చిత్రాలున్నాయని సెన్సార్ బోర్డు అనుమతిని ఇవ్వలేదట. ఇలాంటి సినిమాలు సమాజము పై ప్రభావితం చూపుతాయని సెన్సార్ బోర్డు నిషేధించినట్లు తెలిపింది.