అంజనా దేవి సుపుత్రుడు కాబట్టి ఆంజనేయుడిని.. అంజనా దేవి భర్త పేరు మీదుగా కేసరి నందనుడని… వాయు దేవుడి ద్వారా పుట్టాడని పవన పుత్రుడని.. ఇలా ఆంజనేయునకు ఎన్నో నామాలు.. భజరంగబలి, మారుతీ, హనుమ అని మనం ఎన్నో పేర్లతో భక్తి గ కొలుస్తుంటాం.. ఆంజనేయుడు పుట్టిన జన్మస్థలం పై చాల బిన్నాభి ప్రాయాలున్న .. మహారాష్ట్ర లోనే ఆంజనేయస్వామి పుట్టిన పుణ్యక్షేత్రం కలదని మరి కొందరి అభిప్రాయం … ఇపుడు మనం ఆ పుణ్యక్షేత్రం గూర్చి పూర్తి వివరంగా..తెలుసుకుందాం .
మహారాష్ట్ర నాసిక్ లో ద్వార్దశ జ్యోతర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయం కి వెళ్ళే దారిలో ఆంజనేరి పర్వతము అనే ప్రాంతం వద్ద జన్మించినట్లు అక్కడి ప్రాంత ప్రజలు చెప్తుంటారు . ఈ ఆంజనేరి పర్వతం క్రింద అంజనీ మాత ఆలయం కలదు ఈ ఆలయ గర్భ గుడిలో ఎక్కడలేని విధంగా పసిబాలుడి రూపం లో అంజనా దేవి ఒడిలో ఉండి భక్తులందరికీ దర్శనం ఇస్తున్నాడు. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి ఇక్క డే జన్మించారని.. అందుకే అంజనాదేవి పేరు మీదుగా ఈ కొండకు ఆంజనేరి పర్వతము గా పేరు వచ్చిందని చెబుతారు .
ఈ ఆంజనేరి కొండ 3 కొండలు కలిగి హనుమంతుని మొహం ఆకారం లో ఉండటం మరొక విశేషం. హనుమంతుని దర్శనం కావాలంటే హనుమాన్ చాలీసా ని భక్తి శ్రద్ధ లతో చదువుతూ ఎక్కితేనే కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర పుణ్య స్థలం లో మరియొక అద్భుతమైన విశేషం కలదు.. అదేంటంటే నీరు కొండకు క్రింది నుండి పై కి ప్రవహిస్తుంటాయ్.. అందుకే ఈ వాటర్ ఫాల్స్ ని రివర్స్ వాటర్ ఫాల్స్ అంటారు. మహారాష్ట్ర లోని నాసిక్ లో ఎన్నో ప్రసిద్ధి పుణ్య క్షేత్రాలు కలవు .
ఇక్కడే గోదావరి నది పుట్టినది.. గోదావరి నది అవతలి ఒడ్డున ఉన్న ప్రదేశం పంచవటి. 5 గురు గంధర్వులు శాపానికి గురయ్యారని మర్రి చెట్టు వలే ఉండి, 5 మర్రి చెట్లు కలిసి గుహ ఆకారం లో ఉండటం వలనే ఈ ప్రాంతానికి పంచవటి పేరు కలగిందని పురాణలు చెపుతుంటాయ్ శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతుడై వనవాస సమయంలో ఇక్కడ నివాసమున్నడని, ఇక్కడికి కొంచం దూరం లో సీత గుహ కూడా కలదు. శ్రీరామచంద్రుడు ముగ్గురు రాక్షసులను సంహరించడానికి వెళ్ళినపుడు సీత ను ఇక్కడే ఉంచాడని చెప్తుంటారు. పసిబాలుని ఆకారం లో అంజనా దేవి ఒడిలో ఉన్న అంజనీ సుతుడైన ఆంజనేయుని దర్శనం కోసం ఆంజనేరి కొండ కు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని పురాణాలు చెప్తున్నాయ్.