
మహిళలు గర్భం దాల్చిన తర్వాత 9 నెలలు బిడ్డను కడుపులో మోసిన తర్వాతే ప్రసవిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. సృష్టి మొదలైన నాటి నుంచి ఇదే జరుగుతూ వస్తోంది. కానీ చెందిన ఓ మహిళ మాత్రం సృష్టికి విరుద్ధంగా బిడ్డను ప్రసవించింది. తాను గర్భవతి అని తెలుసుకున్న గంటలోనే పండంటి బిడ్డను ప్రసవించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఈ వింత ఎక్కడా అనుకుంటున్నారా…..ఇండోనేషియాలో జరిగింది.
మండలసరీ అనే గ్రామంలో హెనీ నురేని అనే 30 ఏళ్ల మహిళ నివాసముంటోంది. ఈ మహిళ ఇప్పుడు రాత్రికి రాత్రే సెస్సేషనల్ అయిపోయింది. మగ బిడ్డను కనేందుకు గంట ముందే… ఆమెకు గర్భవతి అని తెలిసిందట. వింటానికి నమ్మశక్యంగా లేకపోయినా…ఇదే నిజం. కొన్ని నెలలుగా తనకు గర్భానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అయితే జూలై 18 రాత్రి ఆకస్మాత్తుగా వాంతులు వచ్చాయి. ఉన్నట్టుండి కడుపు ఉబ్బడం మొదలైందని హెనీ చెబుతోంది. గంట తర్వాత గట్టిగా నొప్పులు వచ్చి బిడ్డకు జన్మనిచ్చానని చెప్పింది.
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే…ఆమె గత 19 నెలలుగా భర్తతో సెక్సులో కూడా పాల్గొలేదట. ఆ రోజు రాత్రి పొత్తి కడుపులో కుడివైపు ఏదో కదులుతున్నట్లు అనిపించింది. నొప్పిగా అనిపించడంతో పొరుగింటి వాళ్ల సాయంతో ……నాన్న ఇంటికి వెళ్లాను. అక్కడికి వెళ్లిన గంట తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది. హెనీకి ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గత 9 నెలలుగా ఆమెకు రుతుస్రావం క్రమం తప్పకుండా జరుగుతుంది. ఒక వేళ అది ఆగినా… ఆమె గర్భవతి అనే విషయం తెలిసేదేమో.
ఇద్దరు పిల్లలను కనేప్పుడు ఏర్పడిన వికారం, వాంతులు కూడా రాలేదు. బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా హెనీలో కనిపించలేదు. అన్నింటికీ మించి 19 నెలలుగా భర్తకు దూరంగా ఉంటుంది. భర్తతో కలవడం లేదు. సో ఎలా చూసుకున్నా గర్భం వచ్చే అవకాశాలు కూడా లేవు. నిజానికి రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఆమె కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. దీంతో హెనీ సెక్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ బిడ్డకు జన్మనివ్వడం అనేది చర్చనీయాంశమైంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి మీడియాకు తెలిసింది. వాళ్ల ద్వారా వైద్యులకు కూడా సమాచారం అందింది. దీంతో ఆ వింతను తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులతో పాటు వైద్యులు ఆమె ఇంటికి క్యూ కట్టారు. ఆమె అనుభవాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ హెనీ మాత్రం ప్రైవసీ నిమిత్తం ….తనను ఎవరూ సంప్రదించవద్దని కోరుతోంది. అయితే కొందరు మహిళలు లక్షణాలు కనిపించకుండానే గర్భం దాల్చిన సంఘటనలు లేకపోలేదు. ఇటీవల ఓ మహిళ తాను గర్భవతి అని తెలియకుండానే బిడ్డకు ప్రసవించింది. అయితే హెనీ భర్తతో కలవకుండానే….. గర్భం దాల్చడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో ఆ బిడ్డను దేవుడిచ్చిన వరమని హెనీ అంటోంది. మరోవైపు వైద్యులు మాత్రం సైంటిఫికల్గా ఈ వింత వెనుక ఉన్న మర్మమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమని ఆరా తీస్తున్నారు. మొత్తానికి 30 ఏళ్ల హెనీ నురేనీ మాత్రం ఇప్పుడు ఇండోనేషియాలోనే కాదు…ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.