
ఫోటో ప్రతీఒక్కరీ జీవితంలో మరువలేని జ్ఞాపకంగా ఉంటుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా సరే ఫోటోలు దిగుతుంటారు. ప్రజెంట్ ట్రెండ్ లో సెల్ఫీలు ఫ్యాషన్ అయిపోయాయి. కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే అప్పట్లో మనం ఇలా ఉన్నామా అని అనుకుని మురిసిపోతాం. ఒక కొత్త అనుభూతిని ఫోటోలు మిగుల్చుతాయి. నిజానికి ఫోటోగ్రఫీ చాలా కష్టమైన పని. అందులోనూ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇంకా కష్టం. అడవుల్లో తప్ప బయట ఎక్కడా కనిపించని అరుదైన జీవులన్నిటినీ ……వెతికి వాటిని జాగ్రత్తగా స్పష్టంగా ఫోటోలు తీస్తుంటారు. ఈ పని చిన్న విషయం కాదు. అందుకే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ….. మామూలు ఫోటోగ్రఫీ కంటే కొంచెం ఎక్కువగా శ్రమతో కూడుకున్న పని. ఎంత కష్టమైన సరే ఒక రోజు , రెండు రోజులు కష్టపడితే ఫోటో తీయగలవచ్చు. కానీ సంచలనం సృష్టించిన ఓ ఫోటోను తీయడానికి….. ఆ ఫోటోగ్రాఫర్‌కు మాత్రం ఆరు రోజులు సమయం పట్టింది.
ఇటీవల మిథున్ అనే ఒక ఫోటో గ్రాఫర్ ఒక చిరుత పులిని, ఒక బ్లాక్ పాంథర్ కలిసి నిల్చుని ఉన్న ఒక ఫోటోని తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బ్లాక్ పాంథర్ పేరు సాయా, చిరుత పులి పేరు క్లియోపాత్రా. ఆ ఫోటో చూస్తే పులులు ఫోటో షూట్ చేయించుకోవడానికి పోజ్ ఇచ్చాయా అన్నట్టుగా ఉంది. అంత నేచురల్‌గా ఉంది. అందుకే ఆ ఫోటో అంత ఫేమస్ అయ్యింది. లక్షల్లో లైకులు, షేర్లు జరిగిపోయాయి. ఆ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు….అదే ఏ స్థాయిలో అలరించిందో. తాను తీసిన ఫోటోకు ఒక మంచి క్యాప్షన్ కూడా పెట్టాడు. మామూలు గా మగ పులి అయిన బ్లాక్ పాంథర్ ముందు ఉంటే ……వెనకాల చిరుతపులి పాంథర్ ని అనుసరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేకంగా చిరుత పులి ని….. పాంథర్ అనుసరిస్తోంది” అని ఫోటో కింద క్యాప్షన్ లో రాశాడు. మిథున్ అంతకుముందు…… నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో సాయా మీద చేసిన డాక్యుమెంటరీకి పని చేశాడు.
కొన్ని రోజుల క్రితం షాజ్ జంగ్ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా …..కబినిలో ఉన్న బ్లాక్ పాంథర్ సాయా ని ఫోటో తీశాడు. ఆ ఫోటో కోసం అతను ఎన్ని రోజులు వెయిట్ చేశాడో తెలిస్తే షాక్ కావడం ఖాయం. ఆ ఫోటో కోసం షాబ్ జంగ్….. దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు . తన డ్రైవర్ ఇంకా ఫారెస్ట్ గార్డ్ తో పాటు అడవిలోకి వెళ్లి ఎంతో జాగ్రత్తగా ……చాలాకాలం ఓపికగా వేచి చూసి ఈ ఫోటో తీశాడు. నేషనల్ జియోగ్రఫీ వాళ్లతో కలిసి షాజ్ పనిచేసిన డాక్యుమెంటరీ ది రేర్ బ్లాక్ పాంథర్ కోసం ఆ ఫోటోను తీశాడు. షాజ్ తన బృందం తో కలిసి 2017 నుండి ప్రయత్నిస్తే…… జనవరి 2020 లో ఇంత మంచి ఫోటో ని తీయగలిగాడు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఒక్క ఫోటో కోసం ఇంత కష్టపడతారా అని చాలా మందికి తెలియదు. కానీ ఈ స్టోరీలతో ఇప్పుడు అందరికి బోధపడి ఉండి ఉంటుంది . కాబట్టి ఫోటోనే కదా ఏముంది చిన్న క్లిక్ చాలు అనుకంటే మీరు తప్పులో కాలేసినట్టే.