Home ట్రెండ్స్ ఆ రెండు శాపాల వల్లే రావణుడు హతమయ్యాడు! అవేంటో తెలుసా?

ఆ రెండు శాపాల వల్లే రావణుడు హతమయ్యాడు! అవేంటో తెలుసా?

Burn The Deca-Headed Ravana In Your Finances

రావణుడు ఎందుకు హతమయ్యాడు? శ్రీరాముడు వధించాడు కాబట్టి! అయితే, స్వయం శ్రీమన్నారాయణుడు అయిన రాముడు ఏ కారణం లేకుండా ఎవర్నీ శిక్షించడు కదా? మరి రావణ వధకు కారణం ఏంటి? సీతమ్మను రావణుడు అపహరించటమే! అది నిజమే అయినప్పటికీ… రావణుడు కేవలం జానకీ దేవిని ఎత్తుకెళ్లి బంధించినందుకే హతం కాలేదు. అంతకంటే ముందు కూడా అతను బోలెడు అపరాధాలు చేశాడు. ముఖ్యంగా, కామాన్ని ఎంత మాత్రం జయించలేని దశగ్రీవుడు కనిపించిన అందమైన ప్రతీ ఆడదాన్ని అనుభవించే వాడు. పెళ్లి చేసుకున్నా, చేసుకోకున్నా తన కోరిక మాత్రం తీర్చుకునేవాడు! అందుకే, వాల్మీకీ రామాయణంలో రావణుడికి అయిదు వేల మంది భార్యలని చెప్పబడింది. వీరిలో రాక్షస, నాగ, యక్ష, కిన్నెర లోకాలకు సంబంధించిన అనేక జాతుల వారు వుండేవారు! అయినా రావణుడి కామావేశం తగ్గలేదు. దాని వల్లే రెండు శాపాలు పొంది… వాటి వల్లే చివరకు రాముడి చేతిలో హతమయ్యాడు!

రావణుడి చావుకి కారణమైన మొదటి శాపం… వేదవతి వల్ల వచ్చింది. ఆమె దేవతల గురువైన బృహస్పతి కొడుకు… కుశధ్వజుడి కుమార్తె. అద్భుత అందాల రాశి అయిన ఆమె శ్రీమహావిష్ణువునే భర్తగా భావించేది. అందుకోసమే యుక్త వయస్సు రాగానే కఠిన తపస్సు చేసింది. కానీ, వేదవతి తపస్సులో వుండగానే రావణుడి కంటపడింది. ఓ రోజు విధివశాత్తూ ఆమెను చూసిన దశకంఠుడు తన కోరిక తీర్చమన్నాడు. వేదవతి ఒప్పుకోలేదు. రావణుడు బలవంతం చేయబోయాడు. వేదవతి రావణుని చేయి పడిన దేహం తనకిక అక్కర్లేదని అగ్నికి ఆహుతి అయింది. అయితే, తనువు చాలిస్తూ శపించింది. మళ్లీ తానే వచ్చి రావణుడి అంతానికి కారణమవుతానని శపథం చేసి వెళ్లింది! రావణుడు మొదటిసారి ఆశపడి పొందలేకపోయిన వేదవతే మరు జన్మలో సీతమ్మగా ఆవిర్భవించింది. అప్పుడు కూడా మరోసారి కామించిన రావణుడికి ఈసారి మరణం తప్పలేదు! వేదవతి ప్రతిజ్ఞ కూడా నిలబడింది!

రావణుడి అంతానికి కారణమైన మరో శాపం… పుంజికస్థల అనే అప్సరస వల్ల వచ్చింది. అందాల రాశి అయిన పుంజికస్థలను ఓ సారి చూసిన రావణుడు బలవంతం చేశాడు. ఆమె ఏడుస్తూ వెళ్లి బ్రహ్మ దేవుడికి మొరపెట్టుకుంది. వరాల గర్వంతో వున్న దశాననుడ్ని పిలిచిన బ్రహ్మ .. పుంజికస్థలను చెరిచినందుకుగాను .. ఇక మీదట ఏ స్త్రీనీ ఇష్టానికి వ్యతిరేకంగా ముట్టుకోకూడదని శాసించాడు. అలా చేస్తే అతడి పది తలలు అప్పటికప్పుడు పగలిపోతాయని శపించాడు. ఈ రెండో శాపం వల్లే రావణుడు సీతాదేవీ నెలల తరబడి లంకలో వున్నా బలవంతం చేయలేదు. సీతాదేవిని ముట్టుకుంటే మరుక్షణం మరణించే వాడు! అయినా కూడా చివరకు ఆమె మీద మోహంతోనే కోదండరాముని తీక్షణ బాణాలకి నేలకూలాడు!

మొత్తానికి రావణుడు అంతం కావటానికి కారణం… అతడు జయించలేకపోయిన కామం, దాని వల్ల వచ్చిన రెండు శాపాలు. ఫలితంగా ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు వేసిన శిక్ష! ఇదీ రావణ పతనం వెనుక దాగిన రహస్యం!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad