Home టాప్ స్టోరీస్ మీరు నిజమని నమ్మే కొన్ని అబద్దాలు

మీరు నిజమని నమ్మే కొన్ని అబద్దాలు

35 Amazing Facts About Nature

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అద్భుతమైనది. అందులోని ప్రతి అంశం ప్రకృతితో మమేకం అయివుంటుంది. అది ప్రకృతిలోని  ప్రతి విషయం వైవిధ్యతను కలిగి ఉంటుంది. అందులోని ప్రాధమిక అంశాలను మనం ఎప్పుడూ తప్పుగా అర్ధం చేసూకుంటాం.  

ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 )జలుబు :

ప్రస్తుత కాలంలో జలుబు అనేది సాధారణ ఇన్ఫెక్షన్స్ గా మారిపోయింది. ప్రతి 10 మందిలో ఇద్దరకి జలుబు సోకుతుంది.అయితే చాలా మంది ఈ విధంగా భ్రమపడతారు.తక్కువ ఉష్ణగ్రత వద్ద ఉన్న, చల్లటి ఐస్ క్రీమ్స్ తిన్నా, వారికీ జలుబు సోకుతుంది అని బలంగా నమ్ముతారు. మరి ఇందులో వాస్తవమెంత ? 

నిజం : జలుబు రైనో వైరస్ సమూహం వలన మనుషులకు సోకుతుంది. వాస్తవానికి ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి ప్రత్యక్ష పద్ధతి ద్వారా సోకుతుంది. అంటే మీరు చల్లని ప్రదేశంలో ఉన్నా, ఐస్ క్రీం తింటున్నా అక్కడ వైరస్ లేకపోతే మీకు జలుబు వచ్చే అవకాశం లేదు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం వైరస్ లు చల్లని ప్రదేశాల్లో వేగంగా వ్యాప్తి చెందగలవు. అంటే వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించకపోతే, చల్లని వాతావరణం మీకు ఎటువంటి జలుబును కలిగించదు.

2)మూడవ ప్రపంచ దేశాలు :

భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు విశ్వసించే విషయాల్లో  విషయాల్లో “మూడవ ప్రపంచ దేశాలు” అనే పదాన్ని చేర్చాలి. మీ స్నేహితుల్లో ఎవరినైనా “మూడవ ప్రపంచ దేశం “ అంటే ఏమిటని ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం ఏమిటో తెలుసా !  వారు అవి పేద దేశాలు అని చెప్తారు.  మరి ఇందులో వాస్తవమెంత ? 

నిజం : రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ప్రపంచం 3 పెద్ద భౌగోళిక రాజకీయ సంఘాలుగా విడిపోయింది. “మొదటి ప్రపంచ” యుద్ధం తరువాత అమెరికాకు అనుకూల దేశాలను “మొదటి ప్రపంచ దేశాలు” అని పిలుస్తారు. రెండవ ప్రపంచం యుద్ధ సమయంలో రష్యాకు అనుకూలంగా ఏర్పడ్డ, సోషలిస్ట్ రాష్ట్రాల తూర్పు కూటమిని రెండవ ప్రపంచ దేశాలు అని పేర్కొంటారు. ఈ రెండు దేశాలతో పొత్తుపెట్టుకొని అభివృద్ధి చెందుతున్న దేశాలను “మూడవ ప్రపంచ దేశాలు” అని పిలుస్తారు. భారత్ మూడవ ప్రపంచ దేశం. 

3)ఊసరవెల్లి :

మీరు ఎప్పుడైనా ఊసరవెల్లిని గమనించారా ? అది ప్రతిసారి తన రంగులను మార్చుతుంది. ఇది చూసి చాల మంది భ్రమపడుతుంటారు. అవి తమ రంగులను చుట్టుపక్కల వస్తువులతో కలపడానికి ప్రయత్నిస్తున్నాయి అని వారు అనుకుంటారు. మరి ఇందులో వాస్తవమెంత ? 

నిజం : ఊసరవెల్లి తన భావోద్వేగ మరియు శారీరక స్థితి వలన నిరంతరాయంగా రంగును మార్చుకుంటుంది. ఈ జంతువు యొక్క చర్మపు రంగును  తన శరీర ఉష్ణోగ్రత ఆధారంగా కూడా మార్పుచెందిస్తాయి. ఈ రంగులు ఆధారంగా ఉసవెల్లిలు ఒకదానితో ఒకటి  కమ్యూనికేట్ చేసుకుంటాయి.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad