Home టాప్ స్టోరీస్ మీరు నిజమని నమ్మే కొన్ని అబద్దాలు

మీరు నిజమని నమ్మే కొన్ని అబద్దాలు

1595904030 4016

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అద్భుతమైనది. మన చుట్టూ ఉండే ప్రతి అంశం ప్రకృతితో మమేకం అయి వుంటుంది. అంతేకాకుండా ప్రకృతిలోని  ప్రతి విషయం వైవిధ్యతను కలిగి ఉంటుంది. అయితే అందులోని కొన్ని ప్రాధమిక అంశాలను మనం ఎప్పుడూ తప్పుగా అర్ధం చేసూకుంటాం. ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1) డియోడ్రెంట్ మరియు యాంటీపెర్స్పిరెంట్ :

శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మనలో అనేక  మంది డియోడ్రెంట్ వినియోగిస్తారు. డియోడ్రెంట్ అంటే బాడీ స్ప్రే. మరికొంత  మంది స్త్రీలు  యాంటీపెర్స్పిరెంట్ లను విమియోగిస్తారు. అనేక మంది ఇవి రెండు ఒకటేనని భ్రమపడతారు. మరి ఇందులో  వాస్తవమెంత ?

నిజం : డియోడ్రెంట్ మరియు యాంటీపెర్స్పిరెంట్ ఒకదానికోటి పర్యాయపదంగా ఉంటాయి. ఇవి రెండు చేసే పనులు ఒకటే అయినప్పటికీ, అవి చూపించే చర్యలు చాలా వైరుధ్యంగా ఉంటాయి. సాధారణంగా డియోడ్రెంట్ లను  చెమట వాసన పోవడానికి వినియోగిస్తాం. అదే యాంటీపెర్స్పిరెంట్ చర్మంపై కెమికల్ రియాక్షన్స్ చూపించి స్వేదాన్ని  నియంత్రిస్తుంది. అందుకే యాంటీపెర్స్పిరెంట్  లను  ఔషదాలుగా పేర్కొంటారు. 

2) బాతులకు రొట్టెతో తినిపించడం : 

మీరు పల్లెటూరిలో గమనించే ఉంటారు. ఎక్కువ మంది ప్రజలు, బాతులకు రొట్టె ముక్కలు తినిపిస్తూవుంటారు. అవి కూడా ఎంతో ఇష్టంగా తింటాయి. నిజంగా బాతులకు రొట్టెలంటే అంత ఇష్టమా ?

నిజం : ఈ ఆహారం బాతులకు అనారోగ్యకరమైనది మరియు అత్యంత ప్రమాదకరమైనది కూడా. పక్షులు రొట్టె రుచిని ఇష్టపడతాయి, కానీ అవి వాటికీ పోషకాలను అందించవు. ఈ ఆహారం పక్షులకు “ఏంజెల్ వింగ్” అనే వ్యాధిని కలుగచేస్తుంది. దీని వలన పక్షుల రెక్క వైకల్యానికి గురిఅవుతాయి.

3) చేపలను రౌండ్ ట్యాంకులలో ఉంచుట : 

మీరు మూవీ థియేటర్స్ మరియు మీ ఫ్రెండ్స్ ఇంట్లో గమనించి ఉంటారు. అక్కడ గుండ్రని “రౌండ్ ట్యాంకులలో” గోల్డ్ ఫిష్  తిరుగుతూ వుంటుంది. అవి ఎంతో ముచ్చటగా ఉంటాయి. నిజంగా చేపలకు రౌండ్ ట్యాంక్స్ అంటే ఇష్టమా ? 

నిజం : ఇది అంత్యంత ప్రమాదకమైనది.  రౌండ్ ట్యాంకులు చేపలకు హానికలిగిస్తాయి.  రౌండ్ ట్యాంకులలో నీటి వడపోతకు తగినంత స్థలం ఉండదు దానితో పాటు అక్వేరియంలోని నీరు త్వరగా మురికిగా మారుతుంది. దీనితో మీరు తరుచు నీటిని మారుస్తూ  ఉండాలి. నీటిని  అధికంగా మార్చడం వలన చేపల పై అధిక ఒత్తిడి కలుగుతుంది. హీటర్ కోసం స్థలం లేకపోవడంతో, నీటి ఉష్ణోగ్రతను నియంత్రించడం చాలా కష్టం. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad