Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు శాస్త్రవేత్తలను కలవర పెడుతున్న కరోనా !

శాస్త్రవేత్తలను కలవర పెడుతున్న కరోనా !

coronavirus blue

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ శాస్త్రవేత్తలకు సరికొత్త సవాళ్ళను విసురుతోంది. తాజాగా చేసిన పరిశోధనలో కరోనా వైరస్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఒకసారి కోలుకున్న వ్యక్తికి కరోనా మరోసారి సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైరస్ కు జన్మస్థానమైన వుహాన్‌లోని సెంట్రల్ ప్రావిన్స్‌ హుబీలో 68 ఏళ్ల ఓ మహిళకు 2019లో కరోనా సోకింది. తరువాత ఆమె కోలుకొని డిశ్చార్జ్ అయ్యింది. తాజాగా ఆమెకి మరోసారి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఆమెలో ఆ వైరస్ గత కొంత కాలం గా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

ఇటువంటి మరొక సంఘటన చైనాలోనే జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏప్రిల్ నెలలో ఒక చైనీయుడు విదేశాలలో పర్యటన చేసి చైనా కు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో అతడికి కరోనా సోకింది. తర్వాత వైద్య చికిత్స అందించడంతో అతడు వైరస్ బారి నుంచి బయట పడ్డాడు. అయితే ఈ నెలలో అదే వ్యక్తికి మరోసారి కరోనా పరీక్షలు చేయగా అతడికి పాజిటివ్ అని తేలింది. కరోనా వైరస్ మరల ఆ వ్యక్తికి ఎలా సోకిందో వైద్యులకే అంతుపట్టడం లేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని కుటుంబ సభ్యుల మరియు అతడి స్నేహితులు ఎవరికీ కరోనా సోకలేదు. ఈ రెండు కేసులను గమనించినట్లయితే కరోనా నుండి కోలుకున్న వారిలో కూడా ఈ వ్యాధి తిరగబెడుతోందని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఒకసారి కరోనా నుండి కోలుకున్న వ్యక్తికి వైరస్ మరలా సోకడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అప్పటికే ఆ వ్యక్తి శరీరంలో యంటీబాడీలు తయారయ్యి ఉంటాయి. ఈ యాంటీబాడీలు త‌ద‌నంత‌రం మ‌ళ్లీ ఆ వ్యాధి సోక‌కుండా ప్రతిరోధ‌కాలుగా ప‌నిచేస్తాయి. కానీ ఈ రెండు కేసుల్లో ఇందుకు విరుద్ధంగా జరిగింది. రోగనిరోధక శక్తి తగ్గుదల కారణంగా వ్యాధి మరల సోకే అవకాశం ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయం తెలిపారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad