Home ట్రెండ్స్ బంగారం ధ‌ర‌కు బ్రేకులు ప‌డ‌టం లేదు.

బంగారం ధ‌ర‌కు బ్రేకులు ప‌డ‌టం లేదు.

Gold price in india

బంగారం ధ‌ర‌ల ప‌రుగుల‌కు బ్రేకులు ప‌డ‌టం లేదు. రోజూరోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గ‌త కొద్ది రోజులుగా బులియ‌న్ మార్కెట్ లో బంగారం ధ‌ర పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. బంగారం ధ‌ర మాత్ర‌మే కాదు వెండి ధ‌ర కూడా అదే దారిలో న‌డుస్తోంది. ఈ రోజు బంగారం ధ‌ర‌ల విష‌యానికొస్తే ఎంసీఎక్స్ గోల్డ్ ఫీచ‌ర్స్ 0.4 శాతం అంటే 240 రూపాయ‌లు పెరిగింది. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర ఏకంగా 500 రూపాయ‌లు పెరిగింది. దీంతో క్రితం ట్రేడ్ లో 55 వేల 316 వ‌ద్ద ముగిసిన ఇవాళ్టి ట్రేడ్ లో అమాంతం 56 వేల 781 రూపాయ‌ల‌కు చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో బంగారంపై పెట్టుబ‌డులు పెర‌గ‌డ‌మే ప‌సిడి ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇంకా చైన్నై హైద‌రాబాద్, కోయంబ‌త్తూరు, విశాఖ‌, భువ‌నేశ్వ‌ర్ న‌గ‌రాల్లో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర 58 వేల 450 రూపాయ‌లుగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులను బ‌ట్టి బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి కూడా 70 వేల వేల్ మార్క్‌కు చేరువైంది. ఈ రోజు ట్రేడ్‌లో భారీగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర ఒక్క రోజే ఏకంగా 2 వేలు పెరిగింది. దీంతో గ‌త ట్రేడ్ లో 66 వేల 754 రూపాయ‌ల వ‌ద్ద ముగిసిన కిలో వెండి ధ‌ర ఇవాళ 72 వేల 726 రూపాయ‌ల‌కు చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో కూడా తొలిసారిగా ఔన్స్ బంగారం ధ‌ర 2 వేల డాల‌ర్లు దాటింది. ఔన్స్ బంగారం ధ‌ర 2 వేల 32 అమెరికన్ డాల‌ర్లు పెరిగింది. ఇక వెండి ధ‌ర కూడా ఇదే దారిలో న‌డిచింది. ఔన్స్ వెండి ధ‌ర 26.40 అమెరిక‌న్ డాల‌ర్ల‌కు పెరిగింది. ఇక పోతే ద్ర‌వ్యోల్బ‌ణం, గ్లోబ‌ల్ ప‌సిడి ధ‌ర‌ల్లో మార్పు, వ‌డ్డీ రేట్లు, జ్యువెల‌రీ మార్కెట్లు, వాణిజ్యయుద్ధాలు స‌హా ప‌లు కీల‌క అంశాలు ప‌సిడి ధ‌ర‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని నిపుణులు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad