Home రాజకీయాలు జాతీయ వార్తలు టిక్‌టాక్ ఇండియాలోకి రానుందా !

టిక్‌టాక్ ఇండియాలోకి రానుందా !

tiktok reliance

భారత నిషేధిత షార్ట్ వీడియో అప్లికేషన్ టిక్‌టాక్ మార్కెట్ విషయం పై అనేక వార్తలు చెక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం టిక్‌టాక్ ఇండియా విభాగాన్నిముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ టేకాఫ్ చేయనుందన్న వార్తలు బిజినెస్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్  మాతృ సంస్థ అయిన బైట్ ‌డాన్స్ తో – ఆర్‌ఐఎల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్, ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ చర్చలు జూలై నెల నుండే జరుగుతున్నాయని టెక్ క్రంచ్ నివేదించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ? అదే నెలలో అమెరికా విభాగాన్ని కూడా మైక్రోసాఫ్ట్ కు అందించడానికి బైట్ ‌డాన్స్ చర్చలు జరిపింది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ నిరాకరించింది. మరోవైపు అమెరికాలో ఇప్పటికే కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 15లోగా టిక్‌టాక్‌ తమ వాటాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే  మైక్రోసాఫ్ట్ చర్చల జరుగుతుంది. ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారత దేశ భద్రత మరియు అంతర్గత విషయాలలో టిక్‌టాక్ జోక్యం చేసుకోవడంతో పాటు డేటా గోప్యతా పలు అనుమానాలు కారణంగా కేంద్ర ప్రభుత్వం టిక్ టిక్ తో సహా చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29 న కేంద్రం నిషేధించింది. అమెరికా కూడా పౌరుల డేటాను  తస్కరిస్తుందనే ఆరోపణపై టిక్‌టాక్ ను బ్యాన్ చేసింది.   

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad