Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కోర్టుకెక్కిన టిక్ టాక్ : ట్రంప్ సర్కార్‌పై దావా

కోర్టుకెక్కిన టిక్ టాక్ : ట్రంప్ సర్కార్‌పై దావా

tikotk

అమెరికా టిక్ టాక్ ప్రతినిధులు మరియు ఉద్యోగులు ట్రంప్ సర్కార్ పై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. టిక్ టాక్ బ్యాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారని టిక్ టాక్ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో దావా వేయనున్నారు. అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సత్కరిస్తుందనే ఆరోపనులుతో ట్రంప్ టిక్‌టాక్ పై బ్యాన్ విధిస్తామని ఇదివరకే ప్రకటించారు. దీనిలో భాగంగా  45 రోజుల్లో టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు లేదా ఇతర కొనుగోలు చేయకపోతే నిషేధం తప్పదని తెలిపారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ వేయనుంది నేడు దీనికి అదనంగా ఉద్యోగస్తులు కూడా పిటిషన్ వేయనున్నారు. బైట్‌డ్యాన్స్ తరుపున వాదిస్తున్న న్యాయవాది మైక్ గాడ్విన్ మాట్లాడుతూ “సర్కార్‌​ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని, ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో టిక్ టాక్ ఉద్యోగుల భవితవ్యంపై గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో పాటు ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని” అన్నారు. ట్రంప్ కారణంగా సెప్టెంబర్ వరకు సంస్థ ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయని దీనితో సుమారు 1500 మంది టిక్‌టాక్‌ ఉద్యోగులుకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని టిక్ టాక్ ప్రకటించింది.

అమెరికా రాజ్యాంగంలోని ఐదు, 14వ సవరణల ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ లేని ఏకపక్ష ప్రభుత్వ చర్య నుండి రక్షణ కావాలని కోరనున్నట్టు మైక్ గాడ్విన్ తెలిపారు. కొన్ని రోజులు క్రితం భారత్ కూడా టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. భారత పూర్తి న్యాయసలహాతోనే ఈ నిషేదం విధించడంతో టిక్ టాక్ సంస్థ ఇప్పటి వరకు కోర్టు మెట్లు ఎక్కలేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad