Home ట్రెండ్స్ ఆ టెన్నిస్ స్టార్… తల్లి అయ్యేందుకు ప్రాణాల్నే పణంగా పెట్టింది!

ఆ టెన్నిస్ స్టార్… తల్లి అయ్యేందుకు ప్రాణాల్నే పణంగా పెట్టింది!

PicsArt 08 12 01.22.45

మాతృత్వం… ఈ పదంలో కేవలం మూడక్షరాలు వున్నట్టు కనిపిస్తుంది! కానీ, ఆ మూడక్షరాల కోసం ఎన్ని కోట్ల మంది స్త్రీలు ఆరాటపడుతుంటారో, ఎంతెంత మంది అల్లల్లాడుతుంటారో… మనకు తెలియంది కాదు! అయితే, తల్లిదనం కోసం తల్లడిల్లటం కేవలం భారతదేశం లాంటి దేశాల్లోనే వుంటుంది. అమెరికా లాంటి చోట్ల వుండదు అనుకుంటారు కొందరు! అమెరికాలో స్త్రీలు చాలా ఆధునికంగా వుంటారు కాబట్టి వాళ్లు ఇక్కడి వారిలా పిల్లల కోసం కలత చెందరూ అనుకునే ప్రమాదం లేకపోలేదు. కానీ, అదంతా అబద్ధం! తల్లి అవ్వాలన్న తపన ఎక్కడైనా స్త్రీమూర్తికి సహజమే! తాను ఎంత సామాన్యురాలైనా… తానెంత అసామాన్యురాలైనా!
మీకు సెరెనా విలియమ్ప్ తెలుసు కదా? యెస్… ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ టెన్నిస్ స్టార్! ఈ నల్లజాతి మేలి ముత్యం ఎన్నోసార్లు గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించింది. ఆమె బరిలోకి దిగితే కప్పుపై ఆశలు వదిలేస్తారు ప్రత్యర్థులు.

అంతగా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. అయితే, తీరా సెరెనా అందరు ఆడవారి లాగే తల్లి కావాలనుకుంటే… అనూహ్యమైన ఆరోగ్య సమస్యలు పదే పదే ఎదురయ్యాయి. ఆమె సిజేరియన్ డెలివరీ అంత ఈజీగా కాలేదు డెలివరీ తరువాత ఆర్నెళ్లు పూర్తిగా బెడ్ రెస్ట్ కే పరిమితం అయిన సెరెనా తిరిగి అంతర్జాతీయ టెన్నిస్ రంగంలోకి కాలుమోపే ముందు మీడియాలో తన మాతృత్వపు అనుభవాలు పంచుకుంది. ఓ అమెరికన్ పత్రికకి రాసిన వ్యాసంలో సెరెనా అసలు తన కూతురు ఒలంపియాకి జన్మనిచ్చిన వెంటనే… తాను మరణించానని అనేసింది! అంతగా డెలివరీ ఇబ్బందికరంగా మారిందట. కడుపులో రక్తం గడ్డకట్టడం అనే సమస్య మొదలై అది ఒక దశలో ఊపిరి తీసుకోటం కూడా అసాద్యం చేసేసిందట. ఊపిరి తిత్తులు పని చేయటమే కష్టంగా మారిపోయి సెరెనా నరకం చూసింది. అయినా, తన బిడ్డని బ్రితికించుకోవాలన్న కృత నిశ్చయంతో ఆమె లేబర్ రూములోకి కాలుమోపింది!
సెరెనా లాంటి మిలియనీర్ కి, అమెరికా లాంటి దేశంలో, అత్యంత నిపుణులైన డాక్టర్లు విజయవంతంగా ప్రసవం చేయించటం… నిజానికి ఆశ్చర్యం కాదు! అదే చెప్పింది సెరెనా. తాను కాబట్టి ఎలాగో బిడ్డని దక్కించుకుని, ప్రాణాలు కూడా దక్కించుకుంది. కానీ, అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనే ప్రసవ సమయంలో తెల్ల వారి కంటే నల్ల జాతి స్త్రీలు మూడింతలు ఎక్కువగా మరణిస్తుంటారట. సరైన వైద్య సేవలు అందక. ఇక ప్రపంచంలోని ఇతర పేద దేశాల్లోని అమ్మల సంగతి చెప్పేదేముంది?
తన మాతృత్వపు అనుభూతులు పంచుకున్న సెరెనా ప్రపంచ వ్యాప్తంగా తల్లి, బిడ్డల సంక్షేమానికి నిధులు పెద్ద ఎత్తున జనం విరాళాలుగా ఇవ్వాలని అభిప్రాయపడింది. అది ఖచ్చితంగా నిజమే! అత్యవసరమే!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad