Home ట్రెండ్స్ కలలు వస్తున్నాయా? ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోకండి…

కలలు వస్తున్నాయా? ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోకండి…

Science behind Dreams

కలలు కనని మనిషంటూ వుండడంటోంది సైన్స్! మనం ప్రతీ రోజూ పడుకున్న సమయంలో కలలు కంటూనే వుంటాం. ఇవి ఎందుకు వస్తాయి అన్న దానికి ఆధునిక సైన్స్ వద్ద సక్కా సమాధానాలు లేవు. కొన్ని వివరణలు వున్నా ఇంకా నిర్ధిష్టింగా ఈ కారణం చేతనే కలలు వస్తాయని ఎవ్వరూ నిరూపించలేదు. ఆ విషయం పక్కన పెడితే మన పురాతన శాస్త్రాలు కూడా స్వప్నాలకి అనేక ఫలితాల్ని చెప్పాయి. కొన్ని కలలు వస్తే శుభమని, కొన్ని వస్తే అశుభమని తీర్మానించాయి. అయితే, వీటికి కూడా అనుమానించే వార్ని తృప్తి పరిచే ఆధారాలు అంటూ ఏం వుండవు. నమ్మటం, నమ్మకపోవటం మన చేతుల్లోనే వుంటుంది. అయితే, కలలకు నిజ జీవితంతో సంబందం వుందా? అవ్వి రాబోయే చెడుని సూచిస్తాయా? లాంటి ప్రశ్నలు పక్కన పెట్టి ఏ కలకి ఏం ఫలితమని పెద్దలు చెప్పారో ఇప్పుడు చూద్దాం…

కలలో నదులు, సరస్సులు, సముద్రాలు వస్తే మనం చేయబోయే పనుల్లో ఆటంకాలు వస్తాయట! విజయం తప్పిపోతూ వుంటుంది. ఇక పులులు, సింహాలు, కోతులు కనిపిస్తే, అది కూడా అశుభమే! రాబోయే కలహాలకి ఈ జంతువులు సంకేతం. బంధువర్గంలో వారితో గొడవలు జరగవచ్చునట! కుక్కలు పోట్లాడుకుంటున్నట్టు కల వస్తే మిత్రులతో, పక్కింటి వారితో మనస్సర్థలు వస్తాయట! కలల్లో రాబోయే ఆర్దిక ఇబ్బందుల్ని సూచించేవి కూడా వుంటాయి. కొండలు ఎక్కుతున్నట్టుగా, చెట్లు ఎక్కుతున్నట్టుగా స్వప్న దర్శనమైతే అది ఆర్దిక ఇబ్బందుల ఆగమనానికి సంకేతం! గుడ్లగూబ, గబ్బిలం కనిపించటం కూడా రాబోయే దరిద్రానికి సూచనే. ఇక ఇంట్లోకి గబ్బిలం వచ్చినట్టుగా కల పడితే , అది, మనం వుంటోన్న ఇంట్లో దుష్ట శక్తి వుందని తెలుపుతుందట.

ఒక వ్యక్తికి తన కలలో తానే తిడుతున్నట్టుగా కనిపిస్తే… అది అతడికి అనారోగ్యం ప్రాప్తించబోతోందని అర్థం. అలాగే, కలలో ఎవరైనా చనిపోయినట్టు అనుభూతి కలిగితే రాబోయే చెడు వార్తకి సంకేతం. ఇలా ఇంకా అనేక దుస్వప్నాలని చెబుతోంది శాస్త్రం. కాకపోతే, అదే శాస్త్రాల్లో పరిష్కారం కూడా చెప్పారు. పండితుల అభిప్రాయం ప్రకారం… మంచి కల , చెడు కల ఏది వచ్చినా ఆనందం, ఆందోళన చెందవల్సిన అవసరం లేదు. కల నిజమైనా , కాకున్నా ఉదయం లేవగానే స్నానం చేసి మన ఇష్ట దైవం ముందు దీపారాధన చేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు చాలా వరకూ దుష్ఫలితాలు రాకుండా వుంటాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad