Home ట్రెండ్స్ రచ్చ చేస్తున్న రియల్ మీ నార్జో 10

రచ్చ చేస్తున్న రియల్ మీ నార్జో 10

Realme Narzo 10 vs Redmi Note 9 Pro 1200

టెక్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా రియల్ మీ నార్జో 10 స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభమయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ మరియు రియల్ మీ వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో ఫోన్ కొందాం అనుకున్న వారికి నార్జో 10 సరిగ్గా సరిపోతుందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ధర  రూ. 12 వేలుగా ఉంది.నార్జో 10  మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అంశాలు  ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో కేవలం ఒకే వేరియంట్ మాత్రమే ఉంది. . 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధర రూ.11,999గా రియల్ నిర్ణయించింది. ఈ ఫోన్ = దట్ బ్లూ, దట్ గ్రీన్, దట్ వైట్ వంటి మూడు రంగుల లభించనుంది.

రియల్ మీ నార్జో 10 స్పెసిఫికేషన్లు :

20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ను నార్జో 10 కలిగి ఉంది. మొదటిగా పేర్కొన్నట్టు  ఇది కేవలం 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభించనుంది. అయితే స్టోరేజ్ ను మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఈ మొబైల్లో ముందు వైపు 16 మెగా పిక్సల్ కెమెరా ఉండగా, వెనుక వైపు మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత ఎంమీయూఐ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇది పనిచేస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బడ్జెట్లలో మంచి మొబైల్ తీసుకున్నాము అనుకున్న వారికి నార్జో 10 బెస్ట్ ఛాయిస్. దీనిపై ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి ఎందుకు లేటు కొనేద్దాం పదండి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad