Home ట్రెండ్స్ నెవ‌ర్ జ‌డ్జి ఎనీ బుక్ బై ఇట్స్ క‌వ‌ర్..

నెవ‌ర్ జ‌డ్జి ఎనీ బుక్ బై ఇట్స్ క‌వ‌ర్..

Rajinikanth

నెవ‌ర్ జ‌డ్జి ఎనీ బుక్ బై ఇట్స్  క‌వ‌ర్ అనే సామెత గురించి మ‌న‌లో చాలా మంది వినే ఉంటాం. దీని అర్ధం పైన ఉన్న అట్ట‌ను చూసి బుక్‌ను అంచ‌నా వేయొద్దు. దీన్ని మ‌నుషులు కూడా వ‌ర్తింప‌జేస్తూ అప్పుడ‌ప్పుడు ఈ సామెత చెబుతూ ఉంటాం. అది మ‌నిషి వేసుకున్న దుస్తుల‌ను బ‌ట్టి అత‌న్ని అంచ‌నా వేయ‌కూడ‌దు అని అర్ధం. నిజానికి  ఒక మనిషిని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని చెప్పడం చాలా కష్టం. చాలా మంది  అలా మనిషిని చూసి అంచ‌నా వేస్తుంటారు.  ఈ క్ర‌మంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా అవుతుంటాయి. ఇందులో పొరపాటు అంటే ఏదో తప్పు అని కాదు మిస్ అండర్స్టాండింగ్ అన్నమాట. దీన్ని వివ‌రించేందుకు ఎన్నో ర‌క‌మైన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒక‌టి బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఒక రోజు గుడి ముందు కూర్చుని ఉన్నాడు.

సాధారణమైన బట్టలతో, పెరిగిపోయిన జుట్టు, గడ్డం తో ఉన్నాడు ఆ వ్యక్తి.  అదే స‌మ‌యంలో ఒక ఆవిడ గుడి దగ్గరికి వచ్చింది. లోపలికి వెళుతూ గుడి దగ్గర కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూసింది. అతనిని ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్న ఆమె……. ఇతనికి కూడా  ప‌ది రూపాయ‌లు  ఇచ్చి గుడి లోకి వెళ్ళింది. ఇక్క‌డే ఊహించ‌ని దృశ్యం ఆమె కంటికి క‌నిపించింది. ద‌ర్శ‌నం చేసుకుని బ‌య‌టకి వ‌చ్చేట‌ప్ప‌టికీ…తాను ఏ వ్య‌క్తికి అయితే ప‌ది రూపాయ‌లు భిక్షం వేసిందే అదే వ్య‌క్తి ఒక ఖ‌రీదైన కారు ఎక్క‌డం చూసింది. అత‌ను  ఎవరో తెలుసుకోకుండా అలా డబ్బులు ఇచ్చాను అని……. కారు దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి ని ఆపి క్షమాపణ తెలిపింది.  అందుకు ఆ వ్యక్తి ” పర్వాలేదమ్మా. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. మీ ద్వారా భగవంతుడు నాకు నా హోదాను చూసుకుని వచ్చిన అహాన్ని తొలగించి…… నేను కూడా ఒక బిచ్చగాడిని అనే సత్యం తెలియజేశాడు” అని అన్నాడు.

ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీని బ‌ట్టి మ‌న‌కు తెలిసింది ఏమిటీ అంటే..ఒక వ్య‌క్తిని చూసి మ‌నం అత‌ని ప‌రిస్థితి ఎలా ఉంది అనే విష‌యంపై అంచ‌నాకు రాలేము. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది త‌మ ద‌గ్గ‌ర ఉన్న దాని కంటే ఎక్కువుగా గొప్ప‌లు చెప్పుకుంటుంటారు. కొంద‌రు మాత్రం ఎంత డ‌బ్బు ఉన్నా సాధార‌ణంగా ఉంటారు.ఇంత‌కీ ఆ మ‌హిళ బెంగ‌ళూరులో ప‌ది రూపాయ‌లు భిక్షం వేసింది ఎవ‌రో తెలుసా……అత‌నే మ‌న సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌. ఈయ‌న చాలా సింపుల్ గా ఉంటారు. ఖ‌రీదైన బ‌ట్ట‌లు ధ‌రించ‌రు. ఇప్ప‌టికీ పాత త‌రం ఫోన్ వాడుతుంటారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా పెద్ద హంగూ ఆర్భాటం ఏమీ ఉండ‌దు.  రోజూ కోటి రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టే ఖ‌ర్చు ఉన్నా…..అలా క‌న్పించ‌డు.  ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుంటారు.  ఈ విషయాన్ని కూడా తేలికగా తీసుకున్నారు.  ఆ సంఘటన ద్వారా దేవుడు తనకి ఒక విషయాన్ని బోధించాడ‌ని  ఆ మహిళతో చెప్పి వెళ్ళిపోయాడు. అందుకేనేమో ఆయ‌న సూప‌ర్ స్టార్ అయ్యాడు.  ర‌జినీకాంత్ న‌ట‌న చూసి ఎంత మంది ఫ్యాన్స్ అయ్యారో అంత‌కంటే ఎక్కువ మంది ఆయ‌న సింపుల్ సిటీ చూసి అభిమానులుగా మారారు అనేది కాద‌న‌లేని స‌త్యం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad