Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో ముందడుగు

వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో ముందడుగు

AdobeStock 270886213

కరోనానును కట్టడి చేయడానికి ప్రపంచదేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే రష్యా ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అయితే ఈ వ్యాక్సిన్‌  భద్రత పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన ఫార్మ దిగ్గజం ఫైజర్‌-బయా-ఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మొదటి దశలో అద్భుతమైన ఫలితాలను వెలువరించినట్లు తెలుస్తోంది. తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను 18 నుండి 18-55 ఏళ్ల వ్యక్తులపై పరీక్షించగా వారిలో రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాలు ప్రముఖ సైన్స్ జర్నల్ “నేచర్‌ పత్రిక” లో ప్రచురితమయ్యాయి.

దీని ప్రకారం జర్మనీ శాస్త్రవేత్తలు ‘బీఎన్‌టీ162బీ1’ అనే ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఇది కరోనా డొమైన్లో ఉన్న ప్రోటీన్ లను పోలిన కణాలను అతిథేయి ఉత్పత్తి చేసేలా చేస్తుంది.  ఈ పోటీలను గుర్తించిన రోగనిరోధక వ్యవస్థ కరోనాకు యాంటీబాడీలను విడుదల చేస్తుంది. 45 మంది పై ఈ ప్రయోగం జరపగా వారిలో 21 రోజుల్లోనే  యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని పరిశోధకులు వివరించారు. అయితే వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చినప్పుడు  నొప్పి, అలసట, తలనొప్పి, జ్వరం, నిద్రలేమి వంటి తేలికపాటి దుష్ప్రభావాలు కనిపించాయన్నారు.

100ఎంజీ కంటే ఎక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు  దుష్ప్రభావాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు సురక్షితమైనవిగా అయినప్పటికీ ఈ ప్రయోగంలో దుష్ప్రభావాలు కనిపించడంతో మరింత లోతుగా పరిశోధన చేయనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad