Home ట్రెండ్స్ పెళ్లైన నాలుగో రోజే తాను మ‌గాడ్ని కాన‌ని.....గేను అని చెప్పేశాడు

పెళ్లైన నాలుగో రోజే తాను మ‌గాడ్ని కాన‌ని…..గేను అని చెప్పేశాడు

gay

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. ల‌క్ష‌ల్లో సంపాద‌న‌. అత‌ను గ్రీన్ కార్డ్ హోల్డ‌ర్ కూడా. ఆ అబ్బాయికి ఇస్తే అమ్మాయి క‌ళ్లు మూసుకుని మ‌రీ కాపురం చేసేయొచ్చు  అనే మాట‌లు స‌హ‌జంగా మ‌నం పెళ్లిళ్ల బ్రోక‌ర్ల వ‌ద్ద , లేదంటే బంధువుల వ‌ద్దో వింటుంటాం. ఈ మాట‌లు విన్న అమ్మాయి త‌ల్లిదండ్రులైనా స‌రే ఆనందంతో గంతులు వేస్తారు. అమ్మాయి జీవితం బాగుంటుంది….ఆస్తుల అమ్మైనా స‌రే పెళ్లి చేసేద్దాం అని భావిస్తుంటారు. అనుకున్న‌ట్టుగానే చేసేస్తుంటారు. ఆ త‌ర్వాత అస‌లు విష‌యం బోధ‌ప‌డి చాలా మంది బాధ‌ప‌డుతుంటారు.  అల్లుడు అలాంటివాడు ఇలాంటివాడు అని కుమిలిపోతుంటారు. అలా అని ఎన్ ఆర్ ఐలంతా అలా కాదు. కొంద‌రు మాత్రం అపురూపంగా చూసుకోవాల్సిన భార్య‌ను క‌ట్నం కోసం వేధిస్తుండ‌డం, హింస్తిస్తుండ‌టం లాంటివి చేస్తుంటారు.

తాజాగా ఇంత కంటే ఘోర‌మైన మోసం ఒక‌టి గుంటూరులో  జ‌రిగింది. ఎన్ ఆర్ ఐ సంబంధ‌మ‌ని 50 ల‌క్ష‌ల  న‌గ‌దు, 75 శ‌వార్ల బంగారంతో క‌ట్నం ఇచ్చి మ‌రీ అమ్మాయికి పెళ్లి చేశారు. మార్చి 18న వీరి పెళ్లి జ‌రిగింది. పిల్ల జీవితం బాగుంటుందిలే అని ఆశ‌తో ….. క‌ట్నం కోసం  అమ్మాయి తండ్రి పొలం కూడా అమ్మేశాడు. పెళ్లైన నాలుగో రోజే  అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఎన్నో ఆశ‌ల‌తో అత్తగారింటికి కాపురానికొచ్చిన న‌వ వ‌ధువుకు…భ‌ర్త ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. పెళ్లైన నాలుగో రోజే తాను మ‌గాడ్ని కాన‌ని…..గేను అని చెప్పేశాడు. అంత‌టితో ఆగ‌లేదు. నాలుగేళ్లుగా ఒక అబ్బాయితో తాను అమెరికాలో స‌హ‌జీవ‌నం చేస్తున్నాన‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశాడు. ఒక వేళ పెళ్లి చేసుకుని అమెరికాకు వ‌స్తే…నువ్వు నేను ఇద్ద‌రూ ఆ అబ్బాయితోనే ప‌డ‌క సుఖాన్ని పంచుకోవాల‌ని చెప్పేశాడు. 

దీంతో అమ్మాయి క‌ల‌లు ఒక్క‌సారిగా చెదిరిపోయాయి. ఇక అప్ప‌టినుంచి రోజూ ఏదో ర‌కంగా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నాడు. భ‌ర్త పెట్టిన ఆ దారుణ‌ల‌న్నీ త‌ల్లిదండ్రుల‌కు తెలిస్తే త‌ట్టుకోలేర‌ని…ఆ బాధ మొత్తాన్ని భ‌రించింది. అంత‌టితో ఆగ‌లేదు. తాను మ‌గ‌త‌నం లేనివాడిన‌ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు కూడా గురి  చేశాడు. య‌క్కంటి శ్రీనివాస‌రెడ్డి అనే వ్య‌క్తితో వార్నింగ్ ఇప్పించాడు. త‌న‌కు రాజ‌కీయ ప్ర‌ముఖులు తెలుసున‌ని….మ‌ర్డ‌ర్ కేసులో ఇరికిస్తాన‌ని అమ్మాయిని బెదిరించాడు. ఇలా రోజూ ఏదో ర‌కంగా హింస‌కు గురి చేస్తూ ఉండేవాడు. 

ఆ వేధింపులు మ‌రి ఎక్కువ కావ‌డంతో…..త‌ల్లిదండ్రుల ముందు ఓపెన్ అయిపోయింది. అంతా క‌లిసి గుంటూరు అర్బ‌న్ ఎస్పీని ఆశ్ర‌యించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఆ చేత‌గాని భ‌ర్త‌పై  ఫిర్యాదు చేశారు. ప‌రిస్థితిని తెల‌సుకున్న అర్బ‌న్ ఎస్పీ….న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad