Home రాజకీయాలు జాతీయ వార్తలు జియో మరో ఆఫర్ : రూ.141 జియో ఫోన్ 2 ?

జియో మరో ఆఫర్ : రూ.141 జియో ఫోన్ 2 ?

jio

టెలికాం దిగ్గజం జియో మరోసారి తన ఆఫర్ల మోత మోగించింది. గతంలో విడుదల చేసిన జియో ఫోన్ కొనసాగింపుగా తయారుచేసిన జియో ఫోన్ 2 పై మంచి ఆఫర్ ను ప్రకటించింది. కృష్ణాష్టమి సందర్భంగా జియో 2 ఫోన్ ను రూ.141 చెల్లించడం ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అంటే మొదటి 141 రూపాయలు చెల్లించి ఆ తర్వాత నుండి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జియో వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి జియో ఫోన్ 2 ధర రూ.2,999గా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ మరింత తక్కువకు వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను చూసుకున్నట్లయితే. జియో ఫోన్ 2  2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లేతో-కైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంతో రానుంది. ఇందులో  512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో ప్రైమరీ కెమెరా 2 మెగా పిక్సల్ కాక ముందు వైపు  వీజీఏ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్ దీని ద్వారా 6 గంటల స్టాండ్ వాయిస్ కాల్ మాట్లాడవచ్చు. ఈ ఫోన్లో  4జీ వోల్టే, వో వైఫై, ఎఫ్ఎం, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ వంటి ఫీచర్లుతో పాటు ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్ ను కూడా ఉన్నాయి.

బడ్జెట్ ధరలో కీప్యాడ్ మొబైల్ ఇష్టపడేవారికి జియో ఫోన్ 2 మంచి అనుభూతిని కలిగిస్తుంది. అన్నిటికి మించి ఈ మొబైల్ కు సాధారణ రీఛార్జిలు వర్తిస్తాయి. నెలకు 70 రూపాయలు రీఛార్జ్ చేస్తే చాలు అన్ లిమిటెడ్ కాల్స్ మరియు వన్ జీబీ డాటా పొందవచ్చు. తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ టుజీ ఫోన్లకి కాలం చెల్లిందని అన్నారు. ఆ తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇతర నెట్ వర్క్ లపై ప్రతీకార చర్యగా ఉందని బిజినెస్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad