
రెండు దశాబ్దాలుగా ఇంటర్నెట్ ను శాసించిన మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కనుమరుగు కానుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి ఎక్స్ప్లోరర్సేవలు నిలిచిపోనున్నాయి అని సంస్థ తెలిపింది. దీని ప్రకారం ఎక్స్ప్లోరర్11 లో మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటి సేవలు సపోర్ట్ చేయవు అలాగే మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటుందనితెలిపింది.
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే క్రోమ్ ఆధారిత వెబ్ బ్రౌజర్ ని తయారుచేసింది. ఇది ఓపెన్ సోర్స్ క్రోమియం సోర్స్ కోడ్ తో నడుస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పేరు పెట్టబడిన ఈ 2020 లాంచ్ అయ్యింది. విండోస్ కెన్ మరియు 8.1 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఈ బ్రౌజర్ వినియోగిస్తుంది. భవిష్యత్తులో ఈ బ్రౌజర్ ను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 25 ఏళ్ల క్రితం, ఆగస్టు,1995లో విడుదలైంది. 2003లో 95 శాతం యూజర్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గా నిలిచింది. అయితే ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఈ పోటీలో దూసుకు రావడంతో ఎక్స్ప్లోరర్ తన మార్కెట్ ను కోల్పోతూ వచ్చింది.