Home టాప్ స్టోరీస్ ఇంత‌కంటే గొప్ప బాస్ ఎక్క‌డైనా ఉంటాడా!

ఇంత‌కంటే గొప్ప బాస్ ఎక్క‌డైనా ఉంటాడా!

gravity payments

కొన్ని సంస్థ‌లు ఉద్యోగుల‌తో గొడ్డు చాకిరీ చేయించుకుని…జీతాలు పెంచ‌డానికి మాత్రం క‌క్కూర్తి ప‌డుతుంటాయి. ఆ సంస్థ ఎదుగుద‌ల‌లో వారికీ పాత్ర ఉంద‌నే సంగ‌తిని మ‌రుస్తుంటాయి. అయితే ఈ బాస్ మాత్రం అలా కాదు. త‌న‌ని న‌మ్ముకుని బ‌తుకుతున్న ఉద్యోగుల బాగోగుల కోసం ఎవ‌రూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఊహించ‌ని ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగుల్లో ఆనందం నింపాడు. అమెరికాలో ఇడాహోలో గ‌ల క్రెడిట్ కార్డుల ప్రాసెసింగ్ సంస్థ గ్రావిటీ పేమంట్స్ ను చార్జెల్ ప్రో అనే సంస్థ‌లు కొనుగోలు చేసింది. ఈ సంద‌ర్భంగా గ్రావిటీ పేమెంట్స్ ఉద్యోగులంతా కొత్త ఆఫీసుకు బ‌దిలీ అయ్యారు. ఈ సంద‌ర్్‌భంగా సంస్థ సీఈవో డ్యాన్ ప్రైస్ వారిని సాద‌రంగా ఆహ్వానించాడు.

ఒక్కొక్క‌రితో వ్య‌క్తిగ‌తంగా స‌మావేశ‌మై వారికి ఓ గుడ్ న్యూస్ వినిపించాడు. ఒక్కో ఉద్యోగి వార్షిక జీతాన్ని 7,10,622 రూపాయ‌లు పెంచుతున్న‌ట్టు చెప్పాడు. ప్ర‌స్తుతం ఆ సంస్థ‌లో ప్ర‌తీ ఉద్యోగి వార్షిక ఆదాయం 28 ల‌క్ష‌ల 42 వేల 488 రూపాయ‌లుగా ఉంది. రానున్న ఐదేళ్లలో ఆ జీతాల‌ను 49 ల‌క్ష‌ల 74 వేల 354కు పెంచుతానంటూ ప్రైస్ మ‌రో స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఈ స‌మాచారం తెలియ‌గానే ఆ సంస్థ ఉద్యోగులంతా ఎగిరి గంతేశారు. అత‌ను బాస్ కాదు దేవుడంటూ ఆకాశానికి ఎత్తేశారు. 2015లో ప్రైస్ త‌న జీతాన్ని 80 నుంచి 90 శాతానికి త‌గ్గించుకున్నాడు. త‌న ఆఫీసులో ఇత‌ర ఉద్యోగుల కంటే త‌క్కువ జీతం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.

ఈ సంద‌ర్భంగా ప్రైస్ మాట్లాడాడు. ఇది వ‌ర‌కు తాను ఏడాదికి మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించేవాడిన‌ని…కానీ నా కోసం ప‌ని చేసే ఉద్యోగులు కేవ‌లం 30 వేల డాల‌ర్లు మాత్ర‌మే సంపాదించేవారు  అని అన్నాడు. అది చాలా త‌ప్పు అని మ‌న‌కు మేలు చేసే ఉద్యోగుల‌కు త‌ప్ప‌కుండా స‌మాన వేత‌నాలు ఇవ్వాల‌ని అని తెలిపాడు. త‌మ ఉద్యోగుల్లో చాలా మంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. వారు త‌క్కువ జీతంతో  కుటుంబాన్ని పోషించ‌డం చాలా క‌ష్టం. ఇందుకు వారు రెండేసి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక‌పై వాళ్లు రెండేసి ఉద్యోగాలు చేయ‌కుండా ఈ జీతంతోనే మంచి జీవితాన్ని పొందాల‌ని..మంచి పేరెంట్‌గా ఉండాల‌ని కోరుకుంటున్నాడు. త‌న సంస్థ‌లో ఉద్యోగులు మంచి జీవితాన్ని సాగించ‌డం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని ప్రైస్ తెలిపాడు. ఇప్పుడు చెప్పండి…ప్ర‌పంచంలో ఇంత‌కంటే గొప్ప బాస్ ఎక్క‌డైనా ఉంటాడా…నిజంగా ఇత‌ను ఉద్యోగుల‌కు దేవుడే క‌దా….

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad