Home టాప్ స్టోరీస్ ప్రతీ కొడుకు విజయం వెనుక ఓ తల్లి వుంటుంది!

ప్రతీ కొడుకు విజయం వెనుక ఓ తల్లి వుంటుంది!

kid-shivaji-with-jijabai

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది అంటారు. ఇలా అనగానే అందరూ భార్యనో, ప్రియురాలినో గుర్తు చేసుకుంటారు. మగవాడు , స్త్రీ అంటే ఆ బంధాలే గుర్తుకు వస్తాయి. కానీ, భూమ్మీద ఏ జీవికైనా మొట్ట మొదటి అనుబంధం తల్లితోనే! ఇక కొడుకులకైతే మరింత ఆత్మీయ శక్తిగా నిలుస్తుంది అమ్మ! ఆమె ప్రభావం ప్రతీ తనయుడి జీవితం మీద అపారం. ఏ కొడుకు ఎప్పుడు, ఎక్కడ విజయం సాధించినా దాని వెనుక అతడి తల్లి ప్రోత్సాహం ఖచ్చితంగా వుండి తీరుతుంది. అందుకే, దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు మన వాళ్లు! అసలు గొప్ప రాజవ్వాలంటే ముందు ఒక గొప్ప తల్లి సంరక్షణలో పెరిగి పెద్దవాడవ్వాలి. అప్పుడే లోకం పది కాలాలు మాట్లాడుకునే ఘనుడు అవుతాడు.

తల్లి ప్రభావంతో చరిత్ర సృష్టించిన , చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన రారాజు శివాజీ! మొగల్ చక్రవర్తుల దండయాత్రలతో దేశమంతా పాదాక్రాంతం అయిపోతోన్న విషమ సమయంలో ఆయన మరాఠా సామ్రాజ్యం నెలకొల్పి వార్ని అడ్డుకున్నాడు. అయితే, అంతటి దీక్షా, పట్టుదల ఛత్రపతి శివాజీలో ఇనుమడించటానికి కారణం ఆయన తల్లి జిజాబాయి. బాల్యంలో చాలా వరకూ తండ్రికి దూరంగా, తల్లి సంరక్షణలోనే శివాజీ పెరిగాడు. ఆయనపై ఆమె ప్రభావం అనంతం! కేవలం యుద్ధాలు చేయటం, రాజ్య విస్తారణ వంటివే కాదు… జిజా భాయి కారణంగానే అత్యున్నతమైన వ్యక్తిత్వం శివాజీ వశమైంది! ఒకసారి ఓ ముస్లిమ్ రాజుని శివాజీ సైన్యాధికారి ఓడించాడు. అతడి అందమైన కోడల్ని బందీగా తీసుకొచ్చాడు.

సభలో అందరి ముందూ ఆమెను ఛత్రపతి ముందు హాజరు పరిచాడు. ఇలా చేయటం అప్పట్లో మామూలు విషయమే. చాలా మంది ముస్లిమ్ రాజులు కూడా ఇతర రాజుల్ని ఓడించినప్పుడు అంతఃపుర స్త్రీలని చెరబట్టే వారు. కానీ, జిజా భాయి నేర్పిన సుగుణాల కారణంగా శివాజీ మరోలా స్పందించాడు! తన ముందు బందీగా వున్న ముస్లిమ్ రాకుమార్తెని, ఆయన, నువ్వు నా తల్లి లాంటి దానివన్నాడు. ఆమెను సత్కరించి… తిరిగి తన రాజ్యానికి సగౌరవంగా పంపాడు. ఇలాంటి వ్యక్తిత్వం వుంది కాబట్టే ఎన్నో యుద్ధాలు చేసినా, ఎన్నో కుట్రల్ని , దాడుల్ని ఎదుర్కొన్నా శివాజీ ఏనాడూ చలించలేదు. దీనికి ప్రధాన కారణం… ఆయన చిన్నతనంలోనే తల్లి జిజా భాయి బోధించిన రామాయణ, భారత ఇతిహాస కథలు! శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారి గొప్ప వ్యక్తిత్వం శివాజీని గొప్పవాడ్ని చేసింది! జిజా భాయి భరతమాతకు ఒక మహానుభావుడ్ని అందించింది! అందుకే, పిల్లల్ని పెంచి, పెద్ద చేయటం… అద్భుతమైన పనులన్నిట్లోకి అత్యద్భుతం!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad