Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కరోనా వైరస్ జన్యుమార్పులు: ప్రాబ్లంలేదంటున్న శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ జన్యుమార్పులు: ప్రాబ్లంలేదంటున్న శాస్త్రవేత్తలు

coronavirus blue 1 1

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ జన్యుమార్పిడి చెందినప్పటికీ వ్యాక్సిన్ దీనిపై సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాజాగా కరోనా వైరస్ జన్యువు ఉత్పరివర్తనాలు పై పరిశోధన చేసిన అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ పై ఒకే రకమైన వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాలు పీఎన్‌ఏఎస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

దీని ప్రకారం శాస్త్రవేత్తలు 84 దేశాల్లో 18,514 మంది నుండి సేకరించిన కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని పరిశీలించారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత జన్యువుల్లో జరిగిన మార్పులను విశ్లేషించారు. శాస్త్రవేత్తల అధ్యయనంలో కరోనా వైరస్ శరీరానికి అనుగుణంగా మార్పు చెందలేదని గుర్తించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన మార్పులన్ని యాదృచ్చికంగా జరిగినవి తప్ప ఒక క్రమంలో జరిగినవి కావని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ జన్యువులో ‘డీ614జీ’ అనే జన్యువు మనిషి శరీరానికి అనుగుణంగా మార్పు చెంద లేదని ప్రకటించారు. గతంలో మరి కొంత మంది శాస్త్రవేత్తలు ఈ జన్యు ఉత్పరివర్తనం చెందినట్లు తెలిపారు. డీ614జీ ప్రభావాన్ని గుర్తించేందుకు మరింత లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్నకోవాగ్జిన్‌ కు తొలి దశ క్లినికల్‌ పరీక్షలను పూర్తి చేసుకుంది. మరోవైపు  జైడస్‌ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్‌-డి సైతం తొలి దశ పరీక్షలలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ను ఇప్పటికే పదహారు వందల మంది పై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ఈ ప్రయోగాలు దేశంలోని 17 ప్రాంతాల్లో 18 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో జరుపుతున్నట్లు తెలిపింది. పరీక్షలు పూర్తయిన తర్వాత నెలకు 10 కోట్ల డోసేజీలను అందించనున్నట్లు సీరమ్‌ తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ 100 మిలియన్ డాలర్లను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ కు విరాళంగా అందించింది. తద్వారా వ్యాక్సిన్ ₹250 లోనే లభించనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad