Home టాప్ స్టోరీస్ ఆ చిప్ మీ ఫోన్లో ఉంటే గోవిందా ? గోవిందా..

ఆ చిప్ మీ ఫోన్లో ఉంటే గోవిందా ? గోవిందా..

PicsArt 08 12 10.10.14

ప్రముఖ సెమీకండక్టర్స్ తయారి సంస్థ “క్వాల్కమ్” ప్రోసెసింగ్ చిప్పులు ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రాసెసర్లు మరియు చిప్స్ లో భద్రతా లోపాలు ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. ప్రస్తుతం “క్వాల్కమ్” చిప్ లను దాదాపు 3 బిలియన్ల స్మార్ట్ ఫోన్ యూజర్లు కలిగి ఉన్నారు. ప్రముఖ చెక్‌పాయింట్ భద్రతా పరిశోధకులు క్వాల్‌కామ్ యొక్క డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ 400 లోపాలను గుర్తించినట్టు అధికారికంగా ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దాదాపు 40 శాతం క్వాల్కమ్ చిప్ లే ఉన్నాయి. వీటిని గూగుల్, శామ్‌సంగ్, ఎల్‌జీ, షియోమి వంటి అనేక సంస్థలు వినియోగిస్తున్నాయి. చెక్ పాయింట్ కనుక్కొన్నలోపల ప్రకారం హ్యాకర్లు వినియోగదారుల ప్రమేయం లేకుండా ఏ స్మార్ట్‌ఫోన్‌ నైన హ్యాక్ చేసి డేటాను దొంగలించవచ్చు.

ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్‌లు, రియల్ టైమ్ మైక్రోఫోన్ డేటా, జిపిఎస్ మరియు లొకేషన్ డేటాతో సహా మొత్తం డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే హ్యాకర్లు ఈ ఫోన్‌లలో మాల్వేర్ మరియు హానికరమైన కోడ్‌ను ఇంజెక్ట్ చేయగలరు. ఇది హ్యాకర్ల కార్యకలాపాలను యూజర్లు కనిపించకుండా చేయడంతో పాటు దానిని ఎప్పటికీ మార్చలేనిదిగా చేస్తుంది. ఇప్పటివరకు ఈ లోపాలకు ఎటువంటి సెక్యూరిటీ ప్యాచ్ లు రిలీజ్ కాలేదు. క్వాల్కమ్ చిప్ లో ఉన్న భద్రతా లోపాలు కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఆపిల్ సొంతంగా తయారు చేస్తున్న చిప్‌లపై ఇవి ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు అని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఈ ఈ చిప్ కలిగిన మొబైల్ వినియోగదారులు మరికొద్ది రోజులు జాగ్రత్తలు పాటించడం మంచిది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad