
ప్రతి కథకు ఓ ముగింపు ఉంటుంది. ప్రతీ జీవితానికి ఒక కారణం కూడా ఉంటుంది. కథ ముగింపు రచయిత చేతిలో ఉంటుంది. జీవితం ముగించడం కాలం చేతిలోనూ లేదంటే మన చేతిలోనూ ఉంటుంది. ఇది సహజ శైలి. కాలం చేతిలో అంటే అనుకోకుండా జరిగే సంఘటన వల్ల ప్రాణాలు కోల్పోవడం….మన చేతిలోనే అంటే ఆత్మహత్యల్లాంటివి చేసుకోవడం.
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. వీటికి ప్రధాన కారణం డిప్రెషన్. స్ట్రెస్ అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. స్ట్రెస్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లిపోవడం ఆ తర్వాత సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకోవాలనుకున్న వాళ్లలో దాదాపు 200 మందిని ఒకే ఒక్క వ్యక్తి కాపాడాడు. విచిత్రమేమిటంటే అతను కూడా ఒకప్పుడు డిప్రెషన్ పేషంటే. కానీ దాని నుంచి బయటపడ్డాడు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని తెలసుకున్నాడు. ఇతని పేరు కెవిన్. అమెరికాలోని శాన్ప్రాన్సిస్కోలో నివాసముంటారు. హైవే పాట్రోల్ఆ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇతని పని సూసైడ్లను ఆపడం. గోల్డ్ గేట్ అనే బ్రిడ్జి వద్ద ఉంది. ఇక్కడ ఏటా కొన్ని వందల సంఖ్యలో ఆత్మహత్యలు నమోదు అవుతుంటాయి. ఏవేవో సమస్యలున్నాయనో…లేదంటే డిప్రెషన్ తట్టుకోలేకే….ఈ బ్రిడ్జిపైకి వచ్చి దూకేసి చనిపోతుంటారు. ఈ బ్రిడ్జి వద్ద పాట్రోల్ ఆఫీసర్ కెవిన్ డ్యూటీ. ఇలా చనిపోదామని వచ్చిన వాళ్లలో దాదాపు 200 మందిని కాపాడాడు. కాపాడటమంటే…దూకేసిన తర్వాత పట్టుకున్నాడని కాదు. వారు దూకకు ముందే వాళ్లను ఆపేసి….కౌన్సెలింగ్ ఇస్తాడు. తన జీవితంలో కూడా డిప్రెషన్ అనే అంకాన్ని దాటి వచ్చానని చెబుతాడు. తనుకు ఎదురైన అనుభవాలు మొత్తాన్ని వివరిస్తాడు. లైఫ్ ప్రాధాన్యత ఏంటో తెలుపుతాడు. అలా ఫైనల్గా వారు ఆత్మహత్య నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేస్తాడు.
ఇలా దాదాపు తన రిటైర్ అయ్యే సమయానికి సుమారు 200 మంది వరకు సేవ్ చేసినట్లు ……..తన రిటైర్ అయ్యాక రాసిన గార్డెన్ ఆఫ్ గోల్డ్ గేట్ పుస్తకంలో వెల్లడించాడు. ప్రస్తుతం ఆ పుస్తకంలోని అంశాలు అక్కడ పెద్ద చర్చకు దారితీశాయి.ప్రజల్లో సూసైడ్ ఆలోచనలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి…. ఎటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి అనే అంశాలపై మన విశ్లేషకులు,మేధావులు చర్చిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ని చూసిన వారంతా……. కెవిన్ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగానే కెవిన్ గ్రేట్. కళ్ల ముందు విలువైన ప్రాణం పోవడాన్ని సహించలేకపోయిన కెవిన్….దాని విలువేంటో చెప్పి 200 మందిని కాపాడి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు.