Home ట్రెండ్స్ మీరు కొనే ఉప్పు, నూనెలో ఎంతటి దోషం వుందో తెలుసా?

మీరు కొనే ఉప్పు, నూనెలో ఎంతటి దోషం వుందో తెలుసా?

PicsArt 08 28 02.16.47 1

మన దేశంలో నమ్మినంతగా జ్యోతిష్యం మరెక్కడా నమ్మరు! కేవలం గ్రహాలు మన మీద ప్రభావం చూపుతాయని భావించటమే కాదు… గ్రహ శాంతులు, జపాలు, దానాలు కూడా చేస్తుంటాం మనం. ఇలాంటి పద్ధతి ప్రపంచంలో మరెక్కడా లేదు. కానీ, నిజంగా ఏవో కొన్ని పదార్థాలు బ్రాహ్మణుడ్ని పిలిచి దానం చేసేస్తే మన గ్రహ బాధలు పోతాయా? దీనికి పెద్ద సైంటిఫిక్ రీసెర్చులు ఏం అక్కర్లేదు. వందలు, వేల ఏళ్లుగా గ్రహ బాధలు దానాల వల్ల పోతున్నాయి కాబట్టే నమ్మకం వున్న వారు చేస్తున్నారు. తమ వారితో చేయిస్తున్నారు. అయితే, ఇక్కడే మనం రోజు వారీ జీవితంలో గుర్తించాల్సింన ఒక చాలా ముఖ్యమైన అంశం వుంది!


సాధారణంగా ఎవరైనా శని బాధలు ఎక్కువగా వుంటే ఏం చేస్తారు? నువ్వులు దానం ఇస్తారు! అలాగే, ఉప్పు కూడా గ్రహ శాంతి కలిగించే పదార్థమే. ఇవే కాక వివిధ రకాల నూనెలకు , బెల్లం వంటి ఆహార పదార్థాలకి కూడా జాతక దోషాల్ని తొలగించే శక్తి వుందంటారు. కాబట్టే వాట్ని గోచారం బాగాలేనప్పుడు దానమిస్తుంటారు. అయితే, ఇవన్నీ మనకు ఎక్కడ్నుంచీ వస్తున్నాయి? కిరాణా కొట్టు నుంచే కదా?
ఉప్పు, బెల్లం, నువ్వులు, నువ్వుల నూనే… ఇలాంటివి కొన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వుండాలి. ఆ పదార్థాల్ని మనం బ్రాహ్మణుడి చేతుల్లో పెట్టి మన గ్రహ దోషాలు వదిలించుకుంటున్నాం. అంటే, అవి చేతులు మారితే గ్రహాల ప్రభావాలు కూడా చేతులు మారతాయి. మనం దానం చేస్తే… మనం ఇచ్చిన నువ్వుల ద్వారా శని ప్రభావం తీసుకున్న వ్యక్తికి చేరుతుంది. ఆయన ఆచారవంతుడైన బ్రాహ్మణుడైతే గాయత్రి మంత్ర సాధన లాంటి వాటి ద్వారా సంక్రమించిన దోషాలు పొగొట్టుకుంటాడు.

మరి ఇప్పుడు ఆలోచించండీ… నువ్వుల వంటి పదార్థాల్ని కొట్టు వాడి చేతిలోంచి డబ్బులు ఇలా అచ్చి అలా నేరుగా అందుకోవటం మంచిదా? అస్సలు కాదు!
ఉప్పు, నువ్వులు, నువ్వుల నూనే, బెల్లం వంటివి షాపు యజమాని చేతి నుంచి నేరుగా అందుకోకూడదు. అలా చేస్తే అతడి దోషాలు మనకొస్తాయి. కాబట్టి డబ్బులు ఇచ్చి అతడ్ని ఆయా పదార్థాలు కింద పెట్టమని … తరువాత అందుకోవాలి. ఇంట్లో కూడా ఉప్పు మొదలైన పదార్థాలు ఒకరికొకరు అందించుకోకూడదు. కింద పెట్టిన తరువాతే తీసుకోవాలి. ఇది గ్రహ దోషాలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా వుండేందుకు పెద్దలు తమ అనుభవం ద్వారా చెప్పిన చక్కటి పరిష్కారం!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad