Home టాప్ స్టోరీస్ బీజేపీలో చేరనున్న సౌరవ్ గంగూలీ..?

బీజేపీలో చేరనున్న సౌరవ్ గంగూలీ..?

Sourav Ganguly

భారత మాజీ క్రికెట్ కెప్టెన్, బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జాతీయ మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటిపై సౌరవ్ గంగూలీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కాగా పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీకి ఓ స్కూల్ తెరిచేందుకు కొంత భూమిని కేటాయించింది.

అయితే అది వివాదంలో ఉన్న భూమి కావడంతో ఇప్పుడు అది కోర్టుకెక్కింది. దీంతో విసిగిపోయిన సౌరవ్ గంగూలీ, ఆ భూమిని తిరిగి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఇచ్చేశాడు. అయితే ఈ అంశాన్ని బీజేపీ పార్టీ తనకు అనుకూలంగా మర్చుకుని సౌరవ్ గంగూలీని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నేతలు సౌరవ్‌కు అండగా నిలుస్తున్నారు. గంగూలీపై మమతా బెనర్జీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

సౌరవ్ గంగూలీ అంటే బెంగాల్ ప్రజల్లో మంచి గుర్తింపుతో పాటు అభిమానం ఉంది. ఈ విధంగా గంగూలీకి బాసటగా నిలిచి, ఆయన్న తమ పార్టీలో చేర్చుకుని బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. మరి బీజేపీ వేస్తున్న ప్లాన్ ఎంతవరకు వారికి కలిసొస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad