Home టాప్ స్టోరీస్ చైనాపై బీసీసీఐ ప్రేమ ఎందుకో..?

చైనాపై బీసీసీఐ ప్రేమ ఎందుకో..?

vivo ipl sponsorship

భారత్-చైనా మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఎలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్రికెట్ బోర్డ్ చేస్తున్న పని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయేడు ఐపీఎల్ టోర్నమెంట్‌ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీకి సంబంధించి అఫీషియల్ ప్రకటనను బీసీసీఐ చేసింది. సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా ఈ టోర్మమెంట్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ఈ టోర్నమెంట్‌కు చైనా కంపెనీ వివో స్పాన్సర్షిప్ చేస్తుండటం ఇప్పుడు పలు విమర్శలకు దారి తీస్తోంది.

గతంలో చైనాతో సత్సంబంధాలు ఉండటంతో ఈ విషయంపై ఎలాంటి వివాదం రేగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీసీఐ ఇంకా వివో స్పాన్సర్షిప్‌ను కొనసాగించడంతో పలువురు మండిపడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌కి కొత్త స్పాన్సర్స్ దొరకడం కష్టం కాబట్టే వివోను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. మరి వివో స్పాన్సర్‌షిప్‌ను బీసీసీఐ కొనసాగిస్తుండటం ఐపీఎల్ టోర్నమెంట్‌పై ఎలాంటి వివాదాలు సృష్టి్స్తుందో చూడాలి. ఇక ఈయేడు జరిగే ఐపీఎల్ టోర్నమెంట్‌పై అప్పుడే క్రికెట్ అభిమానుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి ఈయేడు ఐపీఎల్ టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad