Home టాప్ స్టోరీస్ ఇంకో పదేళ్లు ఉండనున్న కరోనా .. ముందుంది ముసళ్ళ పండగ.

ఇంకో పదేళ్లు ఉండనున్న కరోనా .. ముందుంది ముసళ్ళ పండగ.

Carona Virus

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే కోటి 77 లక్షల కేసులతో ప్రపంచ చరిత్రలోనే సరికొత్త రికార్డును కరోనా సృష్టించింది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచవ్యాప్తంగా 683,278 మంది ప్రజలు మృతి చెందారు. వైరస్ వ్యాప్తి చెంది ఆరు నెలలు అయినా అప్పటికీ వైరల్ లోడ్ మాత్రం తగ్గడం లేదు. 1,701,307 కరోనా కేసులు తో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. తాజాగా కోవిడ్ మహమ్మారి గురించి మరోసారి ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు చేసింది.

నేటితో కోవిడ్ వ్యాప్తి మొదలైన ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ టీమ్ శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ “ కరోనా మహమ్మారి ప్రభావం ఇంకో పదేళ్లపాటు ఉండనుందని అంచనా వేశారు. వైరస్ విజృంభణ చూస్తుంటే దీర్ఘకాలంలో ప్రపంచ దేశాలు మరిన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ప్రతి శతాబ్దానికి ఒకసారి పుట్టుకు వచ్చే ఇటువంటి వైరస్ లు మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మారుతాయని అన్నారు. ప్రస్తుతం వైరస్ విజృంభణ తగిన దేశాలలో సెకండ్ వేవ్ వుండే అవకాశం కూడా ఉందని తెలిపారు.ఈ సందర్భంగా మాస్క్‌‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సిఫార్సులు చేసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేసింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్య ధోరణి కారణంగానే నేడు ఈ పరిస్థితి వచ్చిందని మెజారిటీ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెడ్రోస్ పై విరుచుకుపడుతున్నారు.

చైనాతో కమ్ముక్కయి ఉద్దేశపూర్వకంగానే కోవిడ్‌పై ఆ సంస్థ తాత్సారం చేసిందని అందుకే డబ్ల్యూహెచ్ఓ కు అందే నిధులను నిలిపివేయడంతో పాటు ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. గతేడాది డిసెంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్ ఆ తర్వాత కాలంలో ప్రపంచం మొత్తాన్ని కారు మబ్బులు కమ్మే సింది. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం 150కిపైగా సంస్థలు తీవ్రంగా కృషిచేస్తున్నాయని. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిస్ ను రష్యా శాస్త్రవేత్తలు ఆగస్టు 15న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సుదూర భవిష్యత్తులో కరోనాతో సహజీవనం మాత్రం తప్పనిసరి అయ్యేటట్టు ఉండనుంది .

- Advertisement -

Popular Stories

రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంది అంద‌రూ అనుకునే వ్య‌క్తి నుంచి కాదు తెలుసా….”

సినిమాల్లో వార‌స‌త్వం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ముందు తండ్రులు ఆ త‌ర్వాత వారి కుమారులు, కుమార్తెలు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటారు. స‌క్సెస్ అయితే వాళ్ల...

వర్మ పవర్ స్టార్..రికార్డుల్లో సూపర్ స్టార్ !

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి ప్రత్యేకమైన ఇంట్రోలు, స్పెషల్ ఎఫెక్ట్ లు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వర్మ అంటే వివాదం,...

మగ‌ధీర‌కు 11 ఏళ్లు…ఇన్నేళ్ల‌లో రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్ ఏం సాధించారు

మ‌గ‌ధీర తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ. జూలై 31వ తేదీకి ఆ సినిమా రిలీజై 11 ఏళ్లు...

సినిమాల్లో ప‌డి పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన తార‌లు

ఏ స‌మ‌యంలో చేయాల్సింది ఆ స‌మ‌యంలోనే చేయాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అందుకే ఈడు రాగానే అమ్మాయిలకైనా అబ్బాయిల‌కైనా పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా చేయ‌డం...

ఇగో లేని మ‌నిషి.. ప‌వ‌న్ క‌ల్యాణ్

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన  మొద‌టి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. 2018 అక్టోబ‌ర్ లో రిలీజైన ఈ  సినిమా...
- Advertisement -

Related News

పెళ్ళైన రెండో రోజే ఆత్మహత్య!

కాళ్ల పారాణి ఆర‌లేదు. క‌ట్టిన తోరణాలు ఎండ‌లేదు. ఇంత‌లోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న క‌న్న బిడ్డ తిరిగిరాని లోకాల‌కు...

బ్రాండెడ్ కంపెనీలు వెల‌వెల‌…డిస్కౌంట్, ఆఫ‌ర్ బోర్డుల వెల్క‌మ్

బ్రాండెడ్ దుస్తుల కోసం చాలా మంది పోటీప‌డుతారు. బ్రాండ్ కంపెనీని బ‌ట్టి కొనేస్తుంటారు. ఎంత రేటు ఉన్నా స‌రే త‌మ‌కు న‌చ్చిన బ్రాండ్...

చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన 17 ఏళ్ల కుర్రాడు

భారత్ తో కయ్యానికి కాలు దువ్విన చైనా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంటా,బయట తగలుతున్న షాక్ లుతో కోలుకునే అవకాశం కూడా...
- Advertisement -