Home టాప్ స్టోరీస్ ఐపీఎల్ నుండి వివో ఔట్

ఐపీఎల్ నుండి వివో ఔట్

vivo ipl 1

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న ఐపీఎల్ ఎట్టకేలకు సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ టోర్నీలో తమకు ఎంతో ఇష్టమైన జట్లు పాల్గొంటుండటం, వాటి విజయాని కోసం అభిమానులు కోలాహలం చేయడం మనం తరుచూ చూస్తుంటాం. ఇక గత రెండేళ్లుగా ఐపీఎల్ టోర్నమెంట్‌ను స్పాన్సర్ చేస్తున్న వివో కంపెనీ ఈసారి వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించింది.

ప్రస్తుతం భారత్-చైనాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. అయితే చైనాకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను భారత్ నిషేధించాలని చూస్తుండటం, ఇప్పటికే యాప్‌లు పలు ఉత్పత్తులను భారత్ నిషేధించడంతో వివో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఎక్కువ ప్రేక్షకాదరణ కలిగిన ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుండి వైదొలుగుతున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కంపెనీ కూడా స్పాన్సర్‌షిప్‌కు రాకపోవచ్చనే కారణంతోనే వివోను కొనసాగించాలని చూసింది బీసీసీఐ. అయితే వారికి కౌంటర్‌గా ఐపీఎల్ నుండి వివో వెళ్లిపోవడంతో, ఇప్పుడు మరో స్పాన్సర్‌షిప్ కోసం ఐపీఎల్ నిర్వాహకులు వెతుకుతున్నారు. మరి 2020 ఐపీఎల్‌కు ఎవరు స్పాన్సర్ చేస్తారో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad