Home టాప్ స్టోరీస్ క‌ళార‌త్న వంగ‌పండు ప్ర‌సాద‌రావు ఇకలేరు

క‌ళార‌త్న వంగ‌పండు ప్ర‌సాద‌రావు ఇకలేరు

vangapandu prasada rao

 ఉత్త‌రాంధ్ర  ప‌ల్లెజ‌నం గొంతుక మూగ‌బోయింది. ప్ర‌ముఖ జాన‌ప‌ద‌క‌ళాకారుడు వంగ‌పండు క‌న్నుమూశారు. పార్వ‌తీపురంలోని స్వ‌గృహంలోనే గుండెపోటుతో చ‌నిపోయారు. వంగ‌పండు పూర్తి పేరు వంగ‌పండు ప్ర‌సాద‌రావు. వంగ‌పండుగానే అంద‌రికీ సుప‌రిచితం. వంగ‌పండు మృతితో …..ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో  పాటు అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. 1943లో విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురంలో వంగపండు జ‌న్మించారు. ప‌ల్లెకారుల‌తో పాటు గిరిజ‌నుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఉత్త‌రాంధ్ర జ‌న‌ప‌దాల‌కు….. గ‌జ్జె క‌ట్టి ఆట ఆడారు వంగ‌పండు.  1972లో గ‌ద్ద‌ర్ తో క‌లిసి జ‌న‌నాట్య మండ‌లి స్థాపించి….. జ‌నంలో చైత‌న్యం క‌ల్పించే పాటలు పాడారు. మూడు ద‌శాబ్దాలుగా అల‌రించారు. ఉత్త‌రాంధ్ర గ‌ద్ద‌ర్ గా పేరొందారు.

వంగ పండు రాసిన ఎన్నో పాట‌ల్లో ….. కొన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌చుర్యాన్ని ద‌క్కించుకున్నాయి. దాదాపు 12 భాష‌ల్లో వంగ‌పండు పాట‌లు పాడారు. దేశ‌వ్యాప్తంగా 2 వేల‌కుపైగా ప్ర‌దర్శ‌న‌లు ఇచ్చారు. ప్ర‌జానాయ‌కుడిగా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు.  వంగ‌పండు పాడిన  ఏం పిల్ల‌డో, ఏం పిల్ల‌వో వెళ్దాం వ‌స్త‌వా…జజ్జ‌న‌క‌జ‌నారే లాంటి పాట‌లు ఎప్ప‌టికీ క‌ళ్ల ముందు మెద‌లాడుతూనే ఉంటాయి. ఈ పాట‌లు ప‌ల్లెజ‌నానికి కాదు చ‌దువుకున్న వారికి కూడా చాలా ఇష్టం.  అర్ధ‌రాత్రి స్వ‌తంత్య్రం సినిమాతో వంగ పండు త‌న సినీప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టారు. వంగ‌పండు రాసిన ప‌లు పాట‌ల‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాత‌రం శ్రీనివాస్ అల‌పించారు. అలా సినిమాల ద్వారా కూడా వంగ‌పండు పాట‌లు క‌ళాభిమానుల‌కు సుప‌రిచితం.

 వంగ‌పండు సేవల‌ను మెచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు వ‌రించాయి. 2017లో వంగ‌పండు ప్ర‌సాద‌రావుకు క‌ళార‌త్న పుర‌స్కారం ల‌భించింది. వంగపండు ప్ర‌సాద‌రావు ఎన్నో పాట‌లు పాడి ఉత్త‌రాంధ్ర జాన‌ప‌ద శిఖ‌రంగా పేరొందారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో సాంస్కృతిక శాఖ విభాగం అధ్య‌క్షుడిగా సేవ‌లందించారు. వంగ‌పండుకు  భార్య‌, ముగ్గురు పిల్ల‌లు. ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె ఉషా కూడా గాయ‌నిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆమె వైసీపీ సాంస్కృతిక శాఖ విభాగం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తోంది.  వంగ పండు మృతికి సీఎం వైఎస్ జ‌గ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. వంగ‌పండుతో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  వంగ పండు మృతి ప‌ట్ల కొంద‌రు సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. మంచి క‌ళాకారుడ్ని రాష్ట్రం కోల్పోయింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad