
ఒక్కొక్కరికి ఒక్కో వస్తువుపై ఇష్టం ఉంటుంది. వారికున్న ఆర్థిక స్థోమతను బట్టి ఆ ఇష్టాన్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతుంటారు. అలా మన టాలీవుడ్ స్టార్స్ దగ్గర…..మనకు ఎక్కువుగా రిచ్ కారులే కన్పిస్తుంటాయి. రకరకాల కార్లలో షికార్లు చేస్తుంటారు. వాటి కాస్టు 50 లక్షల పైమాటే. అంత ఖరీదైన కార్లను వాడుతుంటారు. మన టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖుల్లో పలువురికి కార్లే కాదు విమానం కూడా ఉంది. అవును…..సొంత విమానం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పక్క రాష్ట్రానికి వెళ్లాలంటే….లేదంటే పక్కనే ఉన్న దేశానికి వెళ్లాలంటే ఈ జెట్లపైనే వెళ్తుంటారు. నిజానికి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఎదిగిన చాలా మంది…….. కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక సమస్యలతో బాధ పడిన వారే.
ఎన్టీఆర్,చిరంజీవి, మోహన్ బాబు, రవితేజ లాంటి స్టార్లు పేదరికంలో పుట్టి పెరిగినవాళ్లే. అయితే నటనపై ఉన్న ఆసక్తితో తమ సత్తా చాటి ……తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలగా కొనసాగి కోటీశ్వరులయ్యారు. ఇప్పుడు స్టాటస్సే కాదు రేంజ్ కూడా మారిపోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి. ఎన్నో కష్టనష్టాలనోర్చి ఈ స్థాయికి రాగలిగారు. బిడ్డలకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వగలిగారు. చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ……అతనికి బహుమతిగా మూడు కోట్ల రూపాయలతో ఆడి కారు కొనిచ్చారట. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు చిరంజీవి ఎంత ఆస్తి సంపాదించారు అనేది. రాంచరణ్‌కు కార్లే కాదు జెట్ ఫ్లైట్ కూడా ఉంది. తన కోసం ప్రత్యేకంగా ఒక జెట్ ఫ్లైట్ ని కొనుగోలు చేశారట. ఈ జెట్ ఫ్లైట్ ధర 50 నుంచి 80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ప్రైవేట్ ఫ్లైట్ ఉంది. ఇటీవలే 80 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి…… ప్రైవేట్ జెట్ ప్లైట్ కొన్నారట. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన పెళ్లి అయిన తర్వాత ….తమ కుటుంబం కోసం ప్రత్యేకంగా జెట్ ఫ్లైట్ కొన్నారు. అల్లుఅర్జున్ తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాత. ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించారు. నిర్మాతగా ఎన్నో కోట్ల రూపాయలను ఆర్జించారు. అల్లు కుటుంబం తలుచుకుంటే అలాంటి జెట్ ఫ్లైట్లను …..నాలుగైదైనా కొనగలిగే సత్తా ఉంది. ఇక జెట్ ఫ్లైట్ ఉన్న జాబితాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా ఉన్నారు. కుటుంబసమేతంగా ఎక్కడికైనా వెళ్లేందుకు దీన్ని కొనుకున్నారట.
ఇక హీరోలే కాదు మనకు తెలిసిన హీరోయిన్లలో ఒకరికి జెట్ ఫ్లైట్ ఉంది. ఆమె పూజా హెగ్దే. అలవైకుంఠపురంలో సినిమాలో కథానాయకిగా నటించిన పూజాహెగ్దే కూడా జెట్ ఫ్లైట్ కొన్నారు. మరి ఈ ఫ్లైటన్నీ ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు…..వారివారికి దగ్గర్లో ఉన్న విమానాశ్రాయాల్లో ఉంచుతారు. విమానాశ్రయం వారే ఈ సెలబ్రెటీ జెట్ ఫ్లైట్ల మెయింటనెన్స్ చేస్తారు. అందుకోసం నిర్వాహకులకు ప్రతీ నెలా స్టార్లు చెల్లిస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు…సదరు నిర్వాహాకులకు ఫోన్ చేసి రెడీ చేయమంటారు. నేరుగా ఎయిర్ పోర్టుకు వచ్చి సొంత ఫ్లైట్‌లో వచ్చి కూర్చొని…గగన విహారం చేస్తారు. అందుకే అంటారు కలవారు ఏదైనా చేయగలుగుతారు అని.