Home టాప్ స్టోరీస్ రాకెట్ ల దూసుకెళ్తున్న బంగారం ధర

రాకెట్ ల దూసుకెళ్తున్న బంగారం ధర

gold rate in india

ప‌సిడి ధ‌ర ప‌రుగులు పెడుతూనే ఉంది. గ‌త 8 రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా జిగేలు మంది. ద‌గ‌ద‌గ‌మంటూ దూసుకెళ్లింది. స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఆకాశాన్ని అంటింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో బంగారం ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలోనే దేశీయ మార్కెట్ లోనూ బంగారం ధ‌ర‌లు పెరిగాయ‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇవాళ బంగారం ధ‌ర విష‌యానికొస్తే హైద‌రాబాద్ మార్కెట్ లో బంగారం ధ‌ర పెరిగింది. శ‌నివారం 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర 810 రూపాయ‌లు పెరుగుద‌ల‌తో 59 వేల 130 రూపాయ‌ల‌కు చేరింది. అదే స‌మ‌యంలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర ప‌దిగ్రాముల మీద 690 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో…. 54 వేల 200 రూపాయ‌ల‌కు చేరింది. ఇక విశాఖ‌, విజ‌య‌వాడ‌ల్లోనూ ఇవే ధ‌ర‌లు ఉన్నాయి. దీంతో 58 వేల రికార్డు మార్క్‌ను దాటి 59 వేల 130 రూపాయ‌ల వ‌ద్ద నిలిచింది.

ప‌సిడి ధ‌ర పెరిగితే వెండి ధ‌ర అదే బాట‌లో న‌డిచింది. కేజీ వెండి ధ‌ర 350 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో ధ‌ర 73 వేల 850 రూపాయ‌ల‌కు చేరింది. ప‌రిశ్ర‌మ యూనిట్లు, నాణెపు త‌యారీదారుల నుంచి డిమాండ్ మంద‌గించడం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. దేశ‌రాజ‌ధాని ఢిల్లీ మార్కెట్ లోనూ ప‌సిడి ధ‌ర పెరిగింది. 22 క్యారెట్ల ప‌దిగ్రాముల బంగారం ధ‌ర కూడా 400 రూపాయ‌ల‌కు క‌దిలింది. దీంతో ధ‌ర 53 వేల 800 రూపాయ‌ల‌కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల ప‌దిగ్రాముల బంగారం ధ‌ర కూడా ఇదే దారిలో ప‌య‌నించింది. 600 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో 58 వేల 750 రూపాయ‌ల‌కు ఎగ‌సింది. ఇక కేజీ వెండి ధ‌ర 350 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో …73 వేల 350 రూపాయ‌ల‌కు పెరిగింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధ‌ర పెరిగింది. ప‌సిడి ధ‌ర ఔన్స్‌కు 0.75 శాతంపైకి క‌దిలింది. దీంతో బంగారం ధ‌ర ఔన్స్‌కు 2025 డాల‌ర్ల‌కు చేరింది. బంగారం ధ‌ర పెరిగితే వెండి ధ‌ర ఇదే దారిలో న‌డిచింది. వెండి ధ‌ర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుద‌ల‌తో 26.04 డాల‌ర్ల‌కు ఎగ‌సింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad