Home టాప్ స్టోరీస్ టీచ‌ర్స్ టీ హోమ్ గురించి మీకు తెలుసా ?

టీచ‌ర్స్ టీ హోమ్ గురించి మీకు తెలుసా ?

Teacher turned into tea vendor due to covid impact

క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రి జీవితాల‌ను చిన్నాభిన్నాం చేసింది. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయేలా చేసింది. మ‌రెంతో మందిని దిక్కులేని వాళ్ల‌ను చేసింది. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల్లో ప్రైవేటు బ‌డి పంతుల్ల‌లో చాలా మంది ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.  స్కూల్ తెరిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఉపాధ్యాయుల‌కు….. యాజ‌మాన్యాలు జీతాలు ఇవ్వ‌డం లేదు. వేత‌నాలు రాక‌పోవ‌డంతో ఇల్లు గ‌డ‌వ‌ని ప‌రిస్థితి. దీంతో చేసేదేమీ లేక కొంద‌రు స్వ‌యం ఉపాధి వెతుక్కుంటున్నారు. కొంద‌రు స‌రిప‌డా ఆదాయం లేక అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నారు. మ‌రికొంద‌రు ఆత్మాభిమానం చంపుకుని మ‌రీ కూర‌గాయల వ్యాపార‌మో లేదంటే కూలి ప‌నో చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒక‌రు గంగాధ‌ర్‌. నిర్మ‌ల్ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన అనంతుల గంగాద‌ర్‌. ..1985 నుంచి ఓ ప్రైవేటు స్కూల్ లో ఇంగ్లీష్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

దాదాపు 32 ఏళ్ల‌కుపైగా విద్యాబోధ‌న చేస్తున్నాడు.  కానీ కొవిడ్ వైర‌స్ ముప్పుతో వ‌చ్చిన లాక్ డౌన్ …..ఈయ‌న జీవితాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా రోడ్డున ప‌డేలా చేసింది. జీతాలు రాక‌పోవ‌డంతో గంగాధ‌ర్ కుటుంబ జీవ‌నం భారంగా మారింది. కుటంబం గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారిపోయింది. దీంతో వేరే దారి లేక టీ మాస్టార్ అవ‌తార‌మెత్తాడు.  టీచ‌ర్స్ టీ హోమ్ పేరుతో టీ స్టాల్ పెట్టుకుని జీవ‌నాన్ని సాగిస్తున్నాడు. ఎంతో మందిని విద్యావంతులుగా త‌యారు చేసిన వ్య‌క్తి ……ఇప్ప‌డు తాను త‌యారు చేసిన టీని తాగండి అని అడుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింది. అప్పుడు విద్యార్థుల‌కు పాఠాలు నేర్పిన అదే నోరు ఇప్పుడు ఛాయ్ ఆర్డ‌ర్ అడుగుతోంది. చ‌దువులు చెప్పిన అవే చేతులు ఇప్పుడు టీ క‌ప్పులు స‌ర్వ్ చేస్తున్నారు. పాఠాలు చెప్పిన పంతులు ఇప్పుడు టీ అమ్మకోవ‌డానికి సిగ్గు ప‌డ‌టం లేదు.

తాను గ‌ర్వంగా ఫీలువుతున్నాన‌ని చెబుతున్నాడు. నిజానికి అప్ప‌టి కంటే ఇప్పుడే ఆనందంగా ఉన్నాన‌ని చెబుతున్నాడు. లాక్ డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయిన ప్ర‌తీఒక్క‌రూ  ఏదో ఒక‌టి స్వ‌యం ఉపాధి పెట్టుకోవాల‌ని సూచిస్తున్నాడు. ఉద్యోగం పోయింద‌నే బాధ ప‌డ‌వ‌ద్ద‌ని…అలా చేస్తే మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప ఏమీ రావ‌ని హెచ్చ‌రిస్తున్నాడు.  అన్న‌ట్టు ఈ టీ స్టాల్ కూడా సొంత ఖ‌ర్చేమీ కాదు. ద‌శాబ్దాలుగా టీచ‌ర్ వృత్తిలో ఉన్నా ఆయ‌న సంపాదించింది ఏమీ లేదు. దీంతో టీ స్టాల్ పెట్టుకునే స్థోమ‌త కూడా లేక‌పోవ‌డంతో…ఆయ‌న స్నేహితులంతా ఒక్క‌ట‌య్యారు. త‌లా కొంత వేసుకుని ఆయ‌న‌తో టీ స్టాల్ పెట్టించారు. గంగాధ‌ర్ ధీన‌స్థితిపై ఎవ‌రైనా ద‌యా హృద‌యాలు స్పందించాల‌ని కోరుతున్నారు. ప్ర‌భుత్వం ఏదైనా ఉపాధి క‌ల్పిస్తు బాగుండు అని కాంక్షిస్తున్నారు. చ‌దువుకున్న వ్య‌క్తి, బడి పంతులుగా చేసిన వ్య‌క్తి…ఇలా రోడ్డుపై టీ అమ్ముకోవ‌డం బాధ‌గా ఉంద‌ని అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad