
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు పుట్టినిల్లయిన చైనా మరో ప్రమాదకర వైరస్ కు జన్మస్థానం అయ్యింది. తాజాగా చైనాలో ఎస్ఎఫ్టీఎస్ అని పిలవబడే వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 60 మంది ఈ వైరస్ బారిన పడినట్లుగా చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ బుధవారం కథనాన్ని ప్రచురించింది. సివియర్ ఫీవర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్( ఎస్ఎఫ్టీఎస్ ) కరోనా వైరస్ వలే మనుషుల నుండి మనుషులకు సోకుతుందని తెలుస్తోంది. ఈ వైరస్ కేసులు జనవరి నుండి మొదలయ్యాయి. మొదట జియాంగ్సు ప్రావిన్స్‌లో 37 కేసులు , అన్హూయ్ ప్రావిన్స్‌లోనే 23 కేసులు వెలుగు చూసినట్టు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
ఈ వైరస్ కొత్తగా ఏర్పడలేదు ఎఫ్టీఎస్ గత పది సంవత్సరాల నుండి ఉంది. మొదట ఈ వైరస్ చైనాలో ఉనికిలోకి వచ్చింది. ది. ఆ తర్వాత జపాన్, కొరియాలో వ్యాపిస్తు ఇప్పుడు కేసులు నమోదయ్యాయి అయితే తర్వాత ఈ వైరస్ వ్యాప్తి ఆగిపోయింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, దగ్గు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. మరణాల రేటు 10 నుండు 16 శాతంగా ఉండే అవకాశం ఉంది. ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా వ్యాపించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో ఈ కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. ఈ ఆహారపు అలవాట్ల వలనే సరికొత్త వైరస్ లు పుట్టుకు వస్తున్నాయని వైరాలజీస్టులు అభిప్రాయ పడుతున్నారు.ఒకవేళ ఈ వైరస్ అన్ని దేశాలకు వ్యాపిస్తే చైనాను విడిచి పెట్టే ప్రసక్తే ఉండదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.